Dussehra: ఎర్రకోటలో జరిగే దసరా వేడుకల్లో రావణుడి భారీ దిష్టిబొమ్మను దహనం చేయనున్న ప్రభాస్

కొవిడ్ మహమ్మారి కారణంగా రాంలీలా మైదానంలో రెండేళ్ల అనంతరం దసరా వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకకు ఎక్కువ మంది ప్రజలు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు లవ్ కుష్ రాంలీలా కమిటీ తెలిపింది. ఇక రాంలీలా మైదానంలో నిర్వహించే వేడుకల్లో రముడిగా రాఘవ్ తివారీ నటిస్తున్నారు. లక్ష్మణుడిగా అర్జున్ మండోలా, సీత పాత్రలో డెబ్లీనా ఛటర్జీ, హనుమంతుడిగా మహాభారత్ నటుడు నిర్భయ్ వాధ్వా, రావణుడిగా అఖిలేంద్ర మిశ్రా నటిస్తున్నారు.

Dussehra: దేశ వ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో రాంలీలా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఎర్రకోట మైదానంలో రావణ, కుంభ కర్ణ, మేఘనాదుల దిష్టిబొమ్మలు దహనానికి ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బాహుబలి హీరో ప్రభాస్ సహా ఇతర రాజకీయ ప్రముఖులు, దక్షిణాది నటులు హాజరుకానున్నారు.

ఇక ఈసారి వేడుకలకు దూరంగా రాష్ట్రపతి దూరంగా ఉండనున్నారు. ప్రతి ఏడాది ఈ వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాత్రం దూరంగా ఉండనున్నట్లు తెలిసింది. కాగా, రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసే 100 అడుగుల రావణ దిష్టిబొమ్మను రెబల్ స్టార్ ప్రభాస్ దహనం చేయనున్నారు. ఆదిపురుష్ సినిమాలో శ్రీరామునిగా ప్రభాస్ నటిస్తున్న నేపథ్యంలో ఆయనను రవాణ దాహనానికి ముఖ్య అతిథిగా అహ్వానించినట్లు నిర్వహణ కమిటీ లవ్ కుష్ రాంలీలా కమిటీ పేర్కొంది.

కొవిడ్ మహమ్మారి కారణంగా రాంలీలా మైదానంలో రెండేళ్ల అనంతరం దసరా వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకకు ఎక్కువ మంది ప్రజలు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు లవ్ కుష్ రాంలీలా కమిటీ తెలిపింది. ఇక రాంలీలా మైదానంలో నిర్వహించే వేడుకల్లో రముడిగా రాఘవ్ తివారీ నటిస్తున్నారు. లక్ష్మణుడిగా అర్జున్ మండోలా, సీత పాత్రలో డెబ్లీనా ఛటర్జీ, హనుమంతుడిగా మహాభారత్ నటుడు నిర్భయ్ వాధ్వా, రావణుడిగా అఖిలేంద్ర మిశ్రా నటిస్తున్నారు.

Viral videos: ఇరాన్ అమ్మాయిల్లో చైతన్యం.. ధైర్యం అంటే ఇదీ.. హిజాబ్ తీసి, విసిరేసి.. ఆపై తిరగబడి..

ట్రెండింగ్ వార్తలు