Viral videos: ఇరాన్ అమ్మాయిల్లో చైతన్యం.. ధైర్యం అంటే ఇదీ.. హిజాబ్ తీసి, విసిరేసి.. ఆపై తిరగబడి..

తాజాగా, కరజ్ లోని ఓ పాఠశాలలో విద్యార్థినులు హిజాబ్ లు తీసి పడేయడమే కాకుండా, తమను హెచ్చిరించిన స్కూల్ ప్రిన్సిపాల్ ను తరిమికొట్టారు. అతడిపై బాటిళ్లు విసిరేస్తూ, నినాదాలు చేశారు. బానిస సంకెళ్లను తెంచుకున్న పులుల్లా అమ్మాయిలు వెంట పడడంతో ఆ ప్రిన్సిపాల్ చివరకు గేటు తీసుకుని పారిపోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతేకాదు, పలు ప్రాంతాల్లో మత పెద్దలకు, వారి చేష్టలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.

Viral videos: ఇరాన్ అమ్మాయిల్లో చైతన్యం.. ధైర్యం అంటే ఇదీ.. హిజాబ్ తీసి, విసిరేసి.. ఆపై తిరగబడి..

Viral videos: ఇరాన్ అమ్మాయిల్లో చైతన్యం వచ్చింది. అందరి ముందూ హిజాబ్ ను తీసి విసిరేశారు. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ చాలా ప్రాంతాల్లో అమ్మాయిలు హిజాబ్ తీసేస్తున్నారు. దీంతో తమకు ఇష్టం లేకపోయినా ఇన్నాళ్లుగా వారు హిజాబ్ ను ధరించినట్లు స్పష్టమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

తాజాగా, కరజ్ లోని ఓ పాఠశాలలో విద్యార్థినులు హిజాబ్ లు తీసి పడేయడమే కాకుండా, తమను హెచ్చిరించిన స్కూల్ ప్రిన్సిపాల్ ను తరిమికొట్టారు. అతడిపై బాటిళ్లు విసిరేస్తూ, నినాదాలు చేశారు. బానిస సంకెళ్లను తెంచుకున్న పులుల్లా అమ్మాయిలు వెంట పడడంతో ఆ ప్రిన్సిపాల్ చివరకు గేటు తీసుకుని పారిపోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతేకాదు, పలు ప్రాంతాల్లో మత పెద్దలకు, వారి చేష్టలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.

కరజ్ లో తాజాగా అమ్మాయిలు తమకు స్వేచ్ఛ కావాలంటూ పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. అమ్మాయిలో నిండుకున్న ధైర్యానికి వారిపై ఇన్నాళ్లు పెత్తనం చెలాయిస్తున్న వారు భయపడిపోతున్నారు. ఈ నిరసన ప్రదర్శనలో ఎన్నడూ లేనంత ధైర్యాన్ని ప్రదర్శించారు. బడి విద్యార్థులూ తమకు నచ్చని విధానాల పట్ల తిరగబడడం గొప్ప చైతన్యానికి ప్రతీక అని అక్కడి రాజకీయ విశ్లేషకుడు ఎస్ఫాండియర్ బాట్మాంఘెలిడ్జ్ పేర్కొన్నారు. ధైర్యం అంటే ఇదేనంటూ పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

కాగా, కొన్ని వారాల క్రితం హిజాబ్‌ సరిగా ధరించలేదంటూ పోలీసులు అరెస్టు చేసిన మహ్సా అమిని అనే యువతి పోలీసు కస్టడీలో తీవ్రంగా గాయపడి, మృతి చెందిన విషయం తెలిసిందే. అందుకే ఇరాన్‌లో కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ కోపాన్ని, విచారాన్ని తెలపడానికి ఇరాన్ మహిళలు చాలా మంది జట్టు కత్తిరించుకుంటున్నారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. కఠిన చట్టాలు, హిజాబ్ నిబంధనలను తమపై రుద్ద వద్దంటూ ఇరాన్ ప్రజలు నినదిస్తున్నారు. ఛాందసవాదులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..