Kejriwal calls BJP as serial killer of governments
Serial Killer: భారతీయ జనతా పార్టీని సిరియల్ కిల్లర్ అంటూ విమర్శలు గుప్పించారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలు కూలిపోవడం.. వెంటనే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడాన్ని కేజ్రీవాల్ ప్రస్తావిస్తూ.. అన్ని ప్రభుత్వాల్ని హత్య చేసుకుంటూ వస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘బీజేపీ కొన్ని ప్రభుత్వాలను విజయవంతంగా కూలదోసి ఇప్పుడు ఢిల్లీవైపుకు కదిలింది. దేశంలో ప్రభుత్వాన్ని హతమారుస్తున్న సీరియల్ కిల్లర్ బీజేపీ. అంతటా ఒకటే విధమైన హత్య’’ అని కేజ్రీవాల్ అన్నారు. అలాగే గడిచిన కొద్ది సంవత్సారల్లో మొత్తంగా 277 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని ఆయన ఆరోపించారు. కానీ ఢిల్లీలో చేపట్టిన ఆపరేషన్ లోటస్ ఫెయిలై ఆపరేషన్ కీచడ్ (మట్టి) అయిందని ఎద్దేవా చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య రాజకీయ వైరం ఊపందుకుంది.
దీనికి రెండ్రోజుల ముందు ఆప్‌కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి సిద్ధమైందని, ఒక్కో ఎమ్మెల్యేకు 20 కోట్ల చొప్పున లక్కలు కూడా వేసి పెట్టుకున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ వద్ద చాలా డబ్బు ఉంటుందని, అయితే ప్రజల అవసరాలు తీర్చేందుకు ఒక్క రూపాయి కూడా ఉండదని, తాము ప్రజల అవసరాలు తీరుస్తుంటే రేవ్డీ అంటూ హేళన చేస్తున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు.
Jharkhand CM Hemant Soren : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వం రద్దు