Kerala Announces Complete Lockdown From May 8 To May 16 Over Covid Surge
Kerala Complete Lockdown : కేరళకు తాళం పడింది. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కేసుల తీవ్రత పెరగడంతో ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. మే 8 నుంచి మే 16 వరకు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్టు రాష్ట్ర సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. బుధవారం ఒక్క రోజే 42వేల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నెల 8నుంచి 16 వరకు కేరళలో కంప్లీట్ లాక్‌డౌన్ విధించాలని సీఎం విజయన్ నిర్ణయం తీసుకున్నారు.
కేరళ రాష్ట్రవ్యాప్తంగా మే 8 ఉదయం 6 గంటల నుంచి మే 16 వరకు లాక్ డౌన్ అమల్లో ఉండనుంది. కేరళలో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు సీఎం ఒక ప్రకటనలో వెల్లడించారు. కరోనా కట్టడి చేసేందుకు అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా వార్డు స్థాయి కమిటీలను బలోపేతం చేసే దిశగా ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.
As directed by the CM, the entire State of Kerala will be under lockdown from 6am on 8 May to 16 May. This is in the background of a strong 2nd wave of #COVID19.
— CMO Kerala (@CMOKerala) May 6, 2021
అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు, వైద్య విద్యార్థులకు కూడా రప్పిస్తున్నారు. కేరళలో కరోనా కొత్త కేసులు 41వేలు నమోదు కాగా.. కేస్ లోడ్ సంఖ్య 17,43,932కు చేరింది. ఇక రికవరీ అయిన వారి సంఖ్య 23,106గా ఉండగా.. మొత్తంగా రాష్ట్రంలో 13.62 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా రోగుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్న క్రమంలో రాష్ట్రంలో ఆక్సిజన్ అవసరం కూడా భారీగా పెరుగుతోందని సీఎం విజయన్ తెలిపారు.