Church Father : అయ్యప్ప మాల ధరించిన చర్చి ఫాదర్‌, శబరిమల దర్శనం కోసం పదవి వదులుకున్న ఫాదర్

ఓ క్రైస్తవుడు  అయ్యప్ప మాల ధరించారు. చర్చి ఫాదర్ అయ్యప్ప దీక్ష చేపట్టారు. శబరిమల సందర్శిస్తానని తెలిపారు.

Christian priest Rev Manoj visit Sabarimala

Church Father Rev Manoj Sabarimala : జీసన్ ను ఎంతగానో నమ్మే క్రైస్తవులు ఇతర మతాల దేవుళ్లను నమ్మరు. విగ్రహారాధన తప్పు అని భావిస్తారు. అటువంటి ఓ క్రైస్తవుడు  అయ్యప్ప మాల ధరించారు. త్వరలోనే శబరిమల కొలువైన అయ్యప్పను సందర్శించుకుంటానని తెలిపారు. 50 ఏళ్ల మనోనోజ్‌ ప్రసిద్ధ అనే ఫాదర్ (Christian pries)‌శబరిమల క్షేత్ర సందర్శన కోసం రెవరెండ్‌ లైసెన్స్‌ (Church licence)కూడా వదులుకున్నారు. కేరళలోని (Kerala) తిరువనంతపురానికి చెందిన రెవరెండ్‌ మనోజ్‌ కేజీ (Rev Manoj KG) అనే వ్యక్తి ఆంగ్లికన్ చర్చి ఆఫ్‌ ఇండియాలో (Anglican Church of India) ఫాదర్‌గా ఉన్నారు.

ఆయనకు ఇతర మతాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. దీంతో ఆయన అయ్యప్ప మాల ధరించారు. శబరిమల వచ్చి స్వామిని (Sabarimala Temple)దర్శించుకుంటానని తెలిపారు. దీంతో మతపరమైన నియమాలు ఉల్లంఘించారని..ఫాదర్ మనోజ్ పై ఆంగ్లియన్ చర్చి ఆఫ్ ఇండియా నిషేధం విధించింది.ఆయన రెవరెండ్ గుర్తింపు కార్డును క్యాన్సిల్ చేసింది. ఆయన నుంచి రెవరెండ్ కార్డును స్వాధీనం చేసుకుంది. అయ్యప్పను దర్శించుకునే భక్తులు మాల ధరించినట్లుగానే ఫాదర్ మనోజ్ కడా అయ్యప్ప మాల ధరించారు. దీక్ష పూర్తి అయ్యాక ప్రసిద్ధ శబరిమల క్షేత్రాన్ని సందర్శించుకుంటానని తెలిపారు. సెప్టెంబర్ 20న అయ్యప్పను దర్శించుకుంటానని తెలిపారు.

Rishi Sunak : ఢిల్లీ అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించిన రిషి సునాక్.. సతీ సమేతంగా ప్రత్యేక పూజలు

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేసే మనోజ్ 2010లో ఆధ్యాత్మికతవైపుగా పయనించారు. 2015లో ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి స్థాయి ఆధ్యాత్మికవేత్తగా మారారు. అలా ఆయన 2022లో రెవరెండ్ స్థానాన్ని పొందారు. జీతం కూడా తీసుకోకుండా బోధనలు చేసేవారు.అప్పటినుంచి క్రైస్తవ బోధనలు చేసేవారు. మనోజ్ కు ఇతర మతాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. దీంట్లో భాగంగానే ఎన్నో పుస్తకాలు చదివేవారు. ఈక్రమంలో అయ్యప్ప మాల ధరించారు. అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం అయ్యప్ప మాల ధరించారు. దీక్ష పూర్తి అయ్యాక సెప్టెంబర్ 20న శబరిమల వెళ్లి అయ్యప్పను దర్శించుకుంటానని తెలిపారు. క్రైస్తవ నియమాలను ఉల్లంఘించినందుకు తన బోధనల లైసెన్స్ ను వదులుకున్నారు.

Church Father