Car Crash in Kerala : రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇస్రో ఉద్యోగుల మృతి

కేరళలోని అలప్పుజ నేషనల్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఐస్రో ఉద్యోగులు ప్రాణాలుకోల్పోయారు.

Car Crash in Kerala : కేరళలోని అలప్పుజ నేషనల్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఐస్రో ఉద్యోగులు ప్రాణాలుకోల్పోయారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన ఐదుగురు ఉద్యోగులు సోమవారం (జనవరి 23,2023) తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో కారులో ప్రయాణిస్తుండగా ను పాలక్కాడ్ జిల్లాలోని అల్తూరు లోని పెరుమ్ కడవిలా వద్ద కక్కజోమ్ ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో  కారుకు ఎదురుగా వస్తున్న ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. మృతులంతా ఇస్రోకు చెందిన క్యాంటీన్ ఉద్యోగులని కేరళ పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను, క్లీనర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.

మృతులు ప్రసాద్,షిజు, అమల్,సచిన్, సుమోదులుగా గుర్తించారు. వీరిలో నలుగురు తిరువనంతపురానికి చెందినవారని..మరొకకు కొల్లంకు చెందినవారిన తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు అలప్పూజా మెడికల్ కాలేజీకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బియ్యంలోడుతో కేరళలోని అలప్పుజా వెళుతున్న లారీ కారును ఢీ కొట్టటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇస్రో క్యాంటిన్ ఉద్యోగులని వివరించారు. అలప్పుజ నుంచి తిరువనంతపురం వెళుతుండగా వాళ్లు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు