హైటెన్షన్ : ఆలయంలోకి వెళ్లిన మహిళల ఇళ్లపై దాడి

  • Publish Date - January 2, 2019 / 08:04 AM IST

తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శబరిమల ఆలయంలోకి వెళ్లి వచ్చిన ఇద్దరు మహిళల నివాసాలపై కొంతమంది రాళ్లతో దాడికి పాల్పడడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏకంగా కేరళ మంత్రిపైనా కూడా దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది. దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. కోచి, తిరువనంతపురం ప్రాంతాల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వీరిని అడ్డుకొనేందుకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. 

Read Also : శబరిమల ఆలయం మూసివేత : మహిళల ప్రవేశంతో శుద్ధి
Read Also : శబరిమల ఆలయంలో మహిళల పూజలు
ఇద్దరు మహిళల ప్రవేశం…
బిందు, కనకదుర్గ ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించి అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లదుస్తులు ధరించి పంబకు చేరుకున్నారు. తెల్లవారుజామున 3.45గంటలకు ఆలయంలోకి ప్రవేశించారు. స్వామిని దర్శించుకుని తిరిగి వెళ్లిపోయారు. వీరు ప్రవేశించిన దృశ్యాలు సంచలనం అయ్యాయి.పోలీసులు బందోబస్తులో వచ్చారు. గతంలో కూడా వీరు అయ్యప్పను దర్శించుకోవడానికి వచ్చి విఫలం చెందారు. జనవరి 2వ తేదీ మాత్రం అయ్యప్పను దర్శించుకుని సక్సెస్ అయ్యారు. ఆలయ ప్రవేశంపై వివక్ష చూపొద్దంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి ఈ వివాదం నడుస్తూనే ఉంది.

ట్రెండింగ్ వార్తలు