ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసే కేరళ ప్రభుత్వం ఈ కరోనా కాలంలో రైతులకు మేలు కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు పండించే కూరగాయలకు..పండ్లకు కనీస మద్ధతు ధరను నిర్ణయించింది. ఈ విషయాన్ని కేరళ వ్యవసాయ శాఖ మంత్రి V.S సునీల్ కుమార్ తెలిపారు.
16 రకాల కూరగాయలు, పండ్లకు కనీస ధరలను నిర్ణయించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రెండు వ్యవసాయ బిల్లుల నేపథ్యంలో పండ్ల కూరగాయాల రైతులకు కనీస మద్దతు ధర (MSP) ను తొలగిస్తారన్న భయాలు నెలకొన్న ఈ సమయంలో, కేరళ ప్రభుత్వం బుధవారం (అక్బోటర్ 21,2020)న 16 రకాల కూరగాయలు, పండ్లకు ‘మూల ధరలను’ ప్రకటించింది.
నవంబర్ 1 నుంచి ఈ కొత్త ధరల విధానం అమల్లోకి వస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి వి ఎస్ సునీల్ కుమార్ తెలిపారు. దేశంలో కూరగాయలు, పండ్లకు కనీస ధరలు నిర్ణయించడం ఇదే మొదటిసారి అని..అది కేరళ ప్రభుత్వమేనని రైతులు సంతోషంగా ఉంటే ఆ రాష్ట్రం సంతోషంగా ఉంటుందని మంత్రి తెలిపారు.
మూల ధర కూరగాయలు..పండ్ల రకాన్ని బట్టి ఉత్పత్తి వ్యయంలో 20 శాతం ఉంటుందని తెలిపిన మంత్రి..ఒక రైతుకు 20 శాతం మార్జిన్ హామీ ఇవ్వనున్నామని వెల్లడించారు.
మొదటి దశలో కిలోకు 16 రకాలు: టాపియోకా ధర రూ .12, అరటి రూ .30, వయనాదన్ అరటి రూ .24, పైనాపిల్ రూ .15, యాష్‌గోర్డ్ రూ. 9 , దోసకాయ రూ8, క్యారెట్ రూ .21, బంగాళాదుంప రూ .20, బీన్స్ రూ .28, బీట్‌రూట్ రూ .21, వెల్లుల్లి రూ. 139 ధరలను నిర్ణయించింది కేరళ ప్రభుత్వం.