సీఏఏ వ్యతిరేక పోస్టర్‌తో ఒంటెపై ఊరేగుతూ పెళ్లిమండపానికి వచ్చిన వరుడు

పెళ్లికొడుకు పెళ్లి మండపానికి కారులో ఊరేగుతూ వస్తాడు. లేదా గుర్రం ఎక్కి వస్తాడు. కానీ కేరళలో హజా హుస్సేన్ తన పెళ్లి వేడుకల్లో ఒంటెపై ఊరేగుతూ వచ్చాడు. అది పెద్ద విశేషం కాదు. కానీ పెళ్లి కొడుకు తన పెళ్లి ఊరేగింపులో పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. CAAను వ్యతిరేక పోస్టర్‌ను చేతిలో పట్టుకొని ఒంటెపై స్వారీ చేస్తూ..రాజధాని తిరువనంతపురంలో సోమవారం (ఫిబ్రవరి 10,2020)న ఊరేగాడు.
స్నేహితులు..బంధువులతో కలిసి పెద్ద ఊరేగింపుతో ‘రిజెక్ట్ సిఎఎ, బహిష్కరణ ఎన్‌ఆర్‌సి మరియు ఎన్‌పిఆర్’ అనే ప్లకార్డ్‌తో హుస్సేన్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాజిముక్కులోని వివాహ మందిరానికి ఒంటె మీద ఊరేగింపుగా వచ్చాడు.
ఈ సందర్భంగా పెళ్లి కొడుకు హజా హుస్సేన్ మాట్లాడుతూ..తన పెళ్లి ఊరేగింపులో CAA వ్యతిరేకంగా నిరసన చేయాలను అనుకున్నాననీ అందుకే ఇలా వచ్చానని చెప్పాడు.
“మెహర్” (వరుడు బంగారం లేదా డబ్బును వధువుకు అప్పగించే ఆచారం)తో పాటు, నేను పెళ్లి కుమార్తెకు రాజ్యాంగం కాపీని కూడా ఇచ్చాననీ..CAA ను తిరస్కరించాలని కూడా చెప్పానని స్థానిక వ్యాపారవేత్త అయిన హుస్సేన్ తెలిపారు. కాగా CAAక వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి. పలువురు వినూత్న రీతుల్లో CAAను వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది తమ పెళ్లి శుభలేఖల్లో CAAను వ్యతిరేకిస్తూ ప్రింట్ చేయించిన విషయం తెలిసిందే. ఇలా ఎవరికి వచ్చిన ఐడియాలతో వారు CAAను వ్యతిరేకిస్తున్నారు.