Kerala
Medical Oxygen Supply : భారతేదశంలో కరోనా వీర లెవల్లో విజృంభిస్తోంది. గత సంవత్సరం కంటే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. చాలా మందికి ఆక్సిజన్ అవసరం ఏర్పడుతోంది. కానీ..కొన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత కారణంగా రోగులు చనిపోతున్నారు. ఉత్పత్తి, సరఫరా తక్కువగా ఉంటుండడంతో రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అనేక రాష్ట్రాలు మెడికల్ ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న క్రమంలో..కేరళ రాష్ట్రం ఆపన్నహస్తం అందిస్తోంది. పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. కర్నాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాలకు మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్లను సరఫరా చేస్తోంది.
కర్నాటకలోని పలు ఆసుపత్రులకు 36 మెట్రిక్ టన్నులు, తమిళనాడులోని ఆసుపత్రులకు 72 మెట్రిక్ టన్నులు, గోవా ఆసుపత్రులకు 19 మెట్రిక్ టన్నులు ఆక్సిజన్ సరఫరా చేయడం విశేషం. అన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తున్న సమయంలో..కేరళ రాష్ట్రం మాత్రం మిగులు ఆక్సిజన్ నిర్వహిస్తుండడం విశేషం. కేరళ రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ సరఫరా మిగుల్లో ఉందని, కేరళలో 123 ఏళ్ల క్రితమే ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రమైన పెట్రోలియం అండ్ ఎక్స్ ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో)ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కారణమని పెసో డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ వేణుగోపాల్ వెల్లడించారు.
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయడం పెసో బాధ్యత అని, గత సంవత్సరం కరోనా విజృంభణతో ఆక్సిజన్ సరఫరా డిమాండ్ పెరిగిందన్నారు. దీంతో రాష్ట్ర ఆరోగ్య శాఖతో కలిసి..2020 మార్చి నుంచే ఆక్సిజన్ అవసరాలను తీరుస్తోందన్నారు. ఆక్సిజన్ అనేది పరిశ్రమల కోసం ఉత్పత్తి చేయడం జరుగుతుందని, కరోనాతో వీటికి డిమాండ్ పెరగడంతో ఆసుపత్రులకు సరఫరా చేయడం జరుగుతోందన్నారు.
కేరళలోని ఆక్సిజన్ ప్లాంట్లకు ఒకే రోజులో 199 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉందని, ఏప్రిల్ 18 వరకు రోజుకు 89.75 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసింది. కంజికోడ్ లో ఉన్న ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్ ప్రైవేటు లిమిటెడ్ నుంచే ఉత్పత్తి అయ్యింది. మరో ఆక్సిజన్ ఉత్పత్తి సంస్థ ప్రాక్సేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రోజుకు 6 మెట్రికల్ టన్నుల వైద్య ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తోంది. మొత్తంగా ఈ ప్లాంట్లన్నీ కలిపి రోజుకు వేయి 325 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ను నిల్వ చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ఐనాక్స్ ప్లాంట్ వేయి మెట్రిక్ టన్నుల వద్ద అతిపెద్ద నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. గత రెండు వారాల నుంచి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో