కేరళ రాష్ట్రానికి చెందిన పదోళ్ల బుడ్డోడు కొట్టిన గోల్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. గోల్ కొట్టడంలో ఏమీ స్పెషల్ ఉందని అనుకుంటున్నారు. ఫుట్ బాల్‌లో కార్నర్ నుంచి బాల్‌ను గోల్ పోస్టులోకి పంపించడం అంత ఈజీ కాదు. కానీ బాలుడు మాత్రం జీరో కార్నర్‌లో బాల్‌ను ఉంచి..నేరుగా గోల్‌లోకి పంపించాడు. I M Vijayan ట్విట్టర్ వేదికగా గోల్‌కు సంబంధించిన వీడియోను పోస్టు చేశాడు. 2020, ఫిబ్రవరి 11వ తేదీన చేసిన ఈ ట్వీట్..క్షణాల్లోనే వైరల్ అయిపోయింది.
కేరళ రాష్ట్రంలో కోజికోడ్ జిల్లాలోని ప్రెజెంటేషన్ స్కూల్‌లో డాని ఐదో తరగతి చదువుతున్నాడు. ఇతనికి ఫుట్ బాల్ అంటే ఇష్టం. కేరళ ఫుట్ బాల్ ట్రైనింగ్ సెంటర్ (KFTC) క్లబ్ తరపున ఆడుతున్నాడు. వయనాడ్ జిల్లాలోని మీనంగుడిలో ఆల్ కేరళ కిడ్స్ ఫుట్ బాల్ టోర్నమెంట్ జరుగుతోంది. ఫిబ్రవరి 09వ తేదీన జరిగిన మ్యాచ్‌లో డానీ పాల్గొన్నాడు. కార్నర్ అవకాశం వచ్చింది. డానీ బాల్ తీసుకుని జీరో కార్నర్ వద్ద బాల్ ఉంచి..ఒక్క కిక్ ఇచ్చాడు.
ప్రత్యర్థులు చూస్తుండగానే..నేరుగా బాల్ గోల్ పోస్టులోకి వెళ్లిపోయింది. ఎలా వెళ్లిందబ్బా..అంటూ నోరెళ్ల బెట్టారు. అంతేకాదు..ఏకంగా హ్యాట్రిక్ సాధించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్న్ మెంట్ (13 గోల్స్) అవార్డు గెలుచుకున్నాడు. ఫుట్ బాల్ అంటే డానీకి ఎంతో ఇష్టం అని, ఎన్ని ఫుట్ బాల్స్ కొన్నానో లెక్క తెలియదని డానీ తండ్రి అబు హసీం వెల్లడించారు. మెస్సీని కలవలని అతని కోరికగా ఉందన్నారు.
Superb ..മോനെ… pic.twitter.com/EEXrlUPOWD
— I M Vijayan (@IMVijayan1) February 11, 2020