BTech question paper : సినిమా కథపై బీటెక్ పశ్నాపత్రం..విద్యార్ధులు షాక్..

బీటెక్ విద్యార్ధులకు సెమిస్టర్ ఎగ్జామ్స్ లో సినిమా కథపై పశ్నాపత్రంం ఇచ్చారు ఓ ప్రొఫెసర్..ఆ ప్రశ్నాపత్రం చివరలో ఇచ్చిన మరో ట్విస్టకు విద్యార్ధులు నోరెళ్లబెట్టారు..

BTech Mechanical question paper  of Fluids Minnal Murali.. : పరీక్షలు వచ్చాయంటే విద్యార్ధులు టెన్షన్ పడుతుంటారు. ఇక ఇంజనీరింగ్ విద్యార్ధులైతే కసరత్తులే చేస్తారు. ఈ టెన్షన్ చాలదన్నట్లుగా బీటెక్ సెమిష్టర్ లో ఓ ప్రొఫెసర్ చేసిన ఘనకార్యానికి మెకానికల్ ఇంజీరింగ్ విద్యార్ధుంతా షాక్ అయ్యారు.తమకు వచ్చిన ప్రశ్నాపత్రం నిజమా కాదా? అని మరోసారి పరిశీలించి చూసుకున్నారు. తాము చూసేది నిజమేనని నిర్ధారించుకున్న విద్యార్ధులు తలలు పట్టుకున్నారు.ఇంతకీ ఆ ప్రశ్నాపత్రం లో ఏముందంటే..‘సూపర్ హిట్ అయిన ఓ సినిమాకు సంబంధించిన ప్రశ్నలున్నాయి. ఈ వింత ప్రశ్నాపత్రం తయారు చేసినది కేరళలో కావటం విశేషం.

Also read : US Police Arrest Hen : కోడిని అరెస్ట్ చేసిన అమెరికా పోలీసులు..!!

కేరళలోని మార్ అథనాసియస్ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులకు మూడో సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. మెకానికల్‌ ఆఫ్‌ ఫ్లుయిడ్స్‌(Mechanical of Fluids) సబ్జెక్ట్‌లో 50 మార్కుల ప్రశ్నాపత్రం ఉంది.ఈ ప్రశ్నాపత్రంలో మలయాళంలో సూపర్‌ హిట్‌ మూవీ అయిన ‘మిన్నల్‌ మురళి’ స్టోరికి సంబంధించిన ప్రశ్నలున్నాయి.

అది చూసిన విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. అంతేకాదండోయ్..ఈ ప్రశ్నాపత్రం చివర్లో ఉన్న ఎండింగ్ లో ఉన్న గమనికను చూసిన విద్యార్ధులు మరింత షాక్ అయ్యారు.‘‘ఈ ప్రశ్నాపత్రం అతా కల్పితం. నన్ను విమర్శించాలనుకుంటే తర్వాత విమర్శించండి. ఆల్‌ ది బెస్ట్‌. ఎగ్జామ్‌ని ఎంజాయ్ చేయండి’’ అని రాసుంది.దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు.

Also read : ఇలాక్కూడా అడగొచ్చా!! : సార్..నేను చనిపోయాను లీవ్ కావాలి..ఓకే

అసలే విద్యార్ధులు అల్లరి అంతా ఇంతా ఉండదు..పైగా వారు బీటెక్ విద్యార్దులాయే..ఊరుకుంటారా? సోషల్ మీడియాలో వీరులుగా ఉంటారాయే. మరి అలా సోషల్ మీడియాలో తెగ వైరల్‌ చేస్తున్నారు.ఈ ప్రశ్నాపత్రాన్ని రూపొందించిన ప్రొఫెసర్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.ఈ వినూత్న ప్రశ్నాపత్రాన్ని రూపొందించిన ప్రొఫెసర్ పేరు కురియన్ జాన్.

 

 

ట్రెండింగ్ వార్తలు