Ajmal Shareef: ఇన్‭స్టాగ్రామ్‭లో RIP అని స్టేటస్ పెట్టి, ఆ మర్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు

ప్రస్తుతం పోస్ట్ మార్టం పనులు సాగుతున్నట్లు, అందుకోసం వైద్యులకు అజ్మల్ మృతదేహాన్ని ఇచ్చినట్లు రిలేటివ్స్ తెలిపారు. అజ్మల్ కు ఇన్‭స్టాగ్రామ్‭లో 14 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఎవరైనా చనిపోతే రిప్ (RIP) అంటూ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంటాం. కానీ ఓ వ్యక్తి తనకు తానే రిప్ అని ప్రకటించుకుని ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళకు చెందిన 28 ఏళ్ల వ్యక్తి ఘటన ఇది. పేరు అజ్మల్ షరీఫ్. కొచికి సమీపంలోని ఆలువాకు చెందిన అతడు శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు గుర్తించారు. ఇంట్లోని తన వ్యక్తిగత గదిలో ఉరి వేసుకుని మరణించాడు. అంతకు ముందు ఇన్‭స్టాగ్రామ్‭లో తన ఫొటోపై ‘రిప్ అజ్మల్ షరీఫ్’ అని పోస్ట్ పెట్టాడు.

మంచి ఉద్యోగం సంపాదించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం పనులు సాగుతున్నట్లు, అందుకోసం వైద్యులకు అజ్మల్ మృతదేహాన్ని ఇచ్చినట్లు రిలేటివ్స్ తెలిపారు. అజ్మల్ కు ఇన్‭స్టాగ్రామ్‭లో 14 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఇన్‭స్టాగ్రామ్‭లో ఒక పోస్ట్ పెట్టాడు. తన ఫొటోపై ‘రిప్ అజ్మల్ షరీఫ్’ అని రాసిన ఫొటోను షేర్ చేశాడు. అందులో 1995-2013 అని కూడా ఉంది. అంటే అతను పుట్టిన ఏడాదితో పాటు ఆత్మహత్య చేసుకునే ఏడాదిని కూడా ముందుగానే రాశాడు.