Kerala Mother : అమ్మ ప్రేమ గెలిచింది..ఆ బిడ్డ అనుపమ బిడ్డే

కేరళకు చెందిన అనుపమ గత ఏడాది అక్టోబర్‌లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె కేరళలో అగ్రవర్ణంగా గుర్తింపు పొందిన సామాజిక వర్గానికి చెందిన మహిళ.

Kerala Mother : బిడ్డ కోసం తల్లి చేసిన పోరాటం గెలిచింది. అమ్మ ప్రేమ ప్రభుత్వాన్ని కదిలించింది. ఏకంగా కేరళ సీఎం పినరయి విజయనే ఆ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో ఆ తల్లి పోరాటంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం భాగమైంది. పోలీసులు బిడ్డను వెతికి రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఆ తర్వాత జరిగిన డీఎన్‌ఏ పరీక్షలో ఆ చిన్నారి ఆమె పిల్లాడే అని నిర్ధారణయ్యింది. దీంతో ఆ తల్లి ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.

Read More : Two Friends At Kartarpur : దేశ విభజనప్పుడు దూరమై..74 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు

కేరళకు చెందిన అనుపమ గత ఏడాది అక్టోబర్‌లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె కేరళలో అగ్రవర్ణంగా గుర్తింపు పొందిన సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఆమె ప్రేమించిన వ్యక్తి షెడ్యూల్డ్‌ కులానికి చెందిన వ్యక్తి. దీంతో అనుపమ ప్రేమను అంగీకరించని ఆమె తండ్రి స్వయానా కూతురినే మోసం చేశాడు. అనుపమ కన్నబిడ్డను ఆమె నుంచి వేరు చేశాడు. బిడ్డను రహస్య ప్రదేశంలో సంరక్షిస్తున్నట్లు కొద్ది నెలల పాటు ఆమెను మభ్యపెట్టాడు.

Read More : Road Accident :  లారీని ఢీకొన్న పెళ్లి బృందం బస్సు

తాను మోసపోయానని తెలిసిన తర్వాత ఆమె ఇంటి నుంచి పారిపోయి, ప్రేమికుడితో కలసి పోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చింది. అయితే అనుపమ తండ్రి కమ్యూనిస్ట్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కావడంతో పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో ఆమె సీఎంకు ఫిర్యాదు చేసింది. వెంటనే సీఎం ఆదేశించడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన దంపతుల నుంచి బాలుడిని ఆధీనంలోకి తీసుకున్నారు కేరళ పోలీసులు. ఆ తర్వాత రాష్ట్రానికి తీసుకెళ్లి డీఎన్‌ఏ పరీక్షలు జరపగా అనుపమ బిడ్డని తేలింది.

ట్రెండింగ్ వార్తలు