‘Bharat Jodo Yatra’ in Kollam: భారత్ జోడో యాత్రకు విరాళం తక్కువగా ఇచ్చాడంటూ కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని కొట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు.. వీడియో

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ యాత్రకు కొల్లాంలోని కాంగ్రెస్ కార్యకర్తలు బలవంతంగా విరాళాలు వసూలు చేస్తున్నారు. తాజాగా, కూరగాయలు అమ్ముకునే వ్యక్తి వద్దకు వెళ్లి రూ.2000 ఇవ్వాలని అడిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. తాను అంత ఇచ్చుకోలేనని, రూ.500 మాత్రమే ఇస్తానని కూరగాయలు అమ్ముకునే వ్యక్తి చెప్పాడు. దీంతో అడిగినంత ఇవ్వకపోతే చంపేస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు బెదిరిస్తూ అతడిని కొట్టారు. అంతేగాక, కూరగయాల దుకాణం వద్ద బీభత్సం సృష్టించారు. కూరగాయలను కిందపడేశారు.

‘Bharat Jodo Yatra’ in Kollam: కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు విరాళం తక్కువగా ఇచ్చాడంటూ ఓ కూరగాయలు అమ్ముకునే ఓ వ్యక్తిని ఆ పార్టీ కార్యకర్తలు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ యాత్రకు కొల్లాంలోని కాంగ్రెస్ కార్యకర్తలు బలవంతంగా విరాళాలు వసూలు చేస్తున్నారు.

తాజాగా, కూరగాయలు అమ్ముకునే వ్యక్తి వద్దకు వెళ్లి రూ.2000 ఇవ్వాలని అడిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. తాను అంత ఇచ్చుకోలేనని, రూ.500 మాత్రమే ఇస్తానని కూరగాయలు అమ్ముకునే వ్యక్తి చెప్పాడు. దీంతో అడిగినంత ఇవ్వకపోతే చంపేస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు బెదిరిస్తూ అతడిని కొట్టారు. అంతేగాక, కూరగయాల దుకాణం వద్ద బీభత్సం సృష్టించారు. కూరగాయలను కిందపడేశారు.

అడిగినంత డబ్బు ఇవ్వకపోతే కూరగాయల మార్కెట్ నుంచి ఎవ్వరూ కదలబోరని కాంగ్రెస్ కార్యకర్తలు బెదిరించినట్లు తెలుస్తోంది. కూరగాయలు అమ్ముకుంటున్న వారిని బెదిరించిన కాంగ్రెస్ కార్యకర్తల బృందంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి హెచ్.అనీశ్ ఖాన్ కూడా ఉన్నాడు. తనపై జరిగిన దాడి గురించి కూరగాయలు అమ్ముకునే వ్యక్తి ఎస్.ఫవాద్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. విరాళాలు ఇవ్వాలంటూ దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Corona cases: దేశంలో కొత్తగా 6,298 కరోనా కేసులు నమోదు.. నిన్న కోలుకున్న 5,916 మంది

ట్రెండింగ్ వార్తలు