Women Dance Pet Dog Claps (1)
Women dance..Pets dog claps : పెంపుడు జంతువులు యజమానుల ప్రాణాలు కాడటమే కాదు వాళ్లను చక్కగా అనుకరిస్తాయి. యజమాని ఏం చేస్తే చూసి అవి కూడా చక్కగా చేసేస్తాయి. కానీ ఓ కుక్క మాత్రం తన యజమాని చక్కగా చేతులు..కాళ్లు రిథమిక్ గా కదుపుతూ డ్యాన్స్ వేస్తుంటే కట్టేసి ఉన్నాగానీ మనం క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేసినట్లుగా కుక్క తన ముందుకాళ్లతో చప్పట్లు కొడుతున్నట్లుగా ఎంకరేజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కుక్కలు విశ్వాసానికి మారుపేరు అని అనుకుంటాం. కానీ వాటిలో కూడా చక్కటి ఎమోషన్స్ ఉన్నాయని నిరూపించిందీ కుక్క. ముఖ్యంగా పెంపుడు కుక్కల్లో విశ్వాసం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. మనం బాధపడితే అవికూడా దిగాలుగా ఉంటాయి. మన ఉత్సాహంగా ఉంటే అవికూడా హ్యాపీగా గంతెలేస్తుంటాయి. అటువంటిదే కేరళలోని అలప్పుజ జిల్లాలోని చెర్తాలా గ్రామంలో ఆర్ద్రా ప్రసాద్ అనే ఓ యువతి క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంటే ఆమె పెంపుడు కుక్క ఆమె డ్యాన్స్ కు ఫిదా అయిపోయింది. ఆమె డ్యాన్స్ చూసిన ‘మితు’ అనే ఆమె పెంపుడు కుక్క పైకి లేచి తన ముందు కాళ్లతో చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచింది.
ఆమె డ్యాన్స్ చేసినంత సేపు కుక్క అలాగే నిల్చొని ఉత్సాహపరుస్తూ చప్పట్లు కొడుతూండటం విశేషం. అలా ఆమె తన డ్యాన్స్ పూర్తి చేసి..తన కుక్క దగ్గరకు వెళ్లి దానిని గట్టిగా హత్తుకొని సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీనిని మొత్తం వీడియోగా తీసి ఆమె తన తన సోషల్ మీడియాలో షేర్ చేయటంతో అదికాస్తా వైరల్ అయ్యింది. ఈ వీడియోను లక్షలాదిమంది వీక్షించారు. లైక్స్, కామెంట్స్ కు కొదవే లేకుండాపోయింది.