స్టడీ….కరోనా స్టడీ  : వైరస్ వ్యాప్తి నిరోధానికి దూరం పాటిస్తున్న మందు బాబులు

  • Publish Date - March 20, 2020 / 01:40 PM IST

కోవిడ్ -19(కరోనా) వైరస్ వ్యాప్తి చెందకుండా ఎవరకి వారు జాగ్రత్తలు తీసుకోవాలని, సామూహికంగా ప్రజలు గూమి గూడటం వంటివి చెయ్యవద్దని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేసి అమలయ్యేట్టు చూస్తున్నాయి. ప్రజలు కూడా గుంపులు గుంపులుగా చేరకుండా  ప్రాణాంతక వైరస్ మహమ్మారి వ్యాప్తిని  నిరోధించేందుకు జాగ్రత్తపడుతున్నారు. ఈ విషయంలో కేరళ ప్రజలు మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 

కేరళలోని కన్నూరు జిల్లాలోని ఒక మద్యం షాపు వద్ద ప్రజలు మద్యం కోసం ఎగబడకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆ క్యూ లైన్ లో కూడా ప్రజలు మనిషికి మనిషికి మధ్య దాదాపు 6 అడుగులు దూరం పాటిస్తున్నారు.  వైరస్ బారిన పడి లేని పోని ఇబ్బందులకు గురయ్యేకంటే ముందు జాగ్రత్త చర్య పాటిస్తే మంచిదని ప్రజలు ఇలా సహకరించటం చూసి ప్రతి ఒక్కరూ వారిని అభినందిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు  మనిషికి మనిషికి మధ్య దూరం 6 అడుగులు లేదా కనీసం 2 మీటర్లు ఉండాలే చూసుకోమని సూచించింది.  
 

ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచించని దాని ప్రకారం  దగ్గు,తుమ్ములు వచ్చే వ్యక్తికి మీకు కనీసం 3 అడుగులు దూరం  పాటించమని చెప్పింది.   కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నిరోధానికి కేరళ ప్రజలు తీసుకుంటున్నచర్యలు ఇప్పుడు అందరికీ ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఆఖరికి ఊళ్లోకి బస్సు దిగి వచ్చిన వారు కూడా ముందు చేతులు శుభ్రం చేసుకుని ఊళ్లోకి వెళ్లేలా గ్రామస్తులు చేసిన ఏర్పాట్ల వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.