Mask With Mic (1)
BTech student designed New mask with a mic speaker: కరోనా కాలంలో మహమ్మారి నుంచి కాపాడుకోవటానికి మాస్కల్ని ఎంత పటిష్టంగా వాడిని కరోనా బారిని పడుతున్నారు. ఈ క్రమంలో నిపుణుల సలహాల మేరకు డబుల్ మాస్కులను కూడా పెట్టుకోవాల్సి వస్తోంది. డాక్టర్లు, వైద్య సిబ్బంది డ్యూటీలో ఉన్నంతసేపు మాస్కులను ధరించే ఉండాల్సిన అవసరం ఉంది. మాస్కులు పెట్టుకుని కరోనా పేషెంట్లతో మాట్లాడుతున్నప్పుడు మాస్కుల వెనుకనుంచి వచ్చే మాటల్లో స్పష్టత లేని సందర్బాలు కూడా ఉన్నాయి.
దీంతో కరోనా బాధితులకు వైద్య సిబ్బందితో కమ్యూనికేషన్ ఇబ్బందులు కూడా ఉంటున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఓ విద్యార్థి కొత్తరకం మాస్కు తయారు చేశాడు. మాస్కుల వెనుక నుంచి మాట్లాడినా..ఎదుటివారికి స్పష్టంగా వినిపించే మాస్కును తయారు చేశారు. అంటే ఈ మాస్కు పల్చగా ఉంటుందని..అలా ఉంటే కరోనా నుంచి రక్షణ ఎలాగని ఆందోళన అవసరమే లేదంటున్నాడు కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి కెవిన్ జాకబ్.
కెవిన్ జాక్ తయారు చేసిన ఈ కొత్తరకం మాస్కు తో కరోనా వైరస్ మహమ్మారి మధ్య సంభాషణలను సులభతరం చేయవచ్చు అంటున్నాడీ ఇంజనీరింగ్ విద్యార్ధి. పైగా ఇది డబుల్ మాస్కు.విత్ మైక్, స్పీకర్‌తో కూడిన మాస్క్ తయారు చేశాడు కెవిన్ జాకబ్. ఈ మాస్క్ ద్వారా డాక్టర్లు కరోనా బాధితులతో చాలా ఈజీగా మాట్లాడవచ్చని..మాటల్లో స్పష్టం చాలా బాగా ఉంటుందని అంటున్నాడు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో డాక్టర్లతో పాటు ఇతర వైద్య సిబ్బంది డబుల్ మాస్క్‌లతో పాటు పీపీఈ కిట్‌లను ధరిస్తున్నారు.
దీంతో వైద్య సిబ్బందికి బాధితులతో సరిగా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో కేరళకు చెందిన కెవిన్ జాకబ్ తయారు చేసిన ఈ కొత్త మాస్కు అటువంటి సమస్యలను తొలగిస్తుందంటున్నాడు. కెవిన్ ఈ మాస్కును డబుల్ మాస్క్ విత్ మైక్ ను అమర్చటంతో మాటలు చాలా స్పష్టంగా వినిపిస్తాయంటున్నాడు. కెవిన్ జాకబ్ తల్లిదండ్రులు కూడా డాక్టర్లే కావటంతో వారు కరోనా బాధితులతో మాట్లాడేటప్పుడు సమస్యలు ఎదుర్కొనడాన్ని జాకబ్ గమనించాడు. దీనికి పరిష్కారంగానే కెవిన్ జాకబ్ ఈ స్పీకర్ మాస్క్ తయారు చేశానని చెబుతున్నాడు.