Khudiram Bose : చేతిలో భగవద్గీత.. చిరునవ్వుతో ఉరికంభం ఎక్కిన 18 ఏళ్ల ధీరుడు

దేశం కోసం బ్రిటీషర్లతో కొట్లాడి నవ్వుతూ ఉరికంభం ఎక్కిన మహా వీరుడు. చేతిలో భగవద్గీత పట్టుకుని 1908 లో సరిగ్గా ఇదే రోజున (ఆగస్టు 11)ప్రాణాలు అర్పించిన వీరుడు,ధీరుడు ఖుదీరాం బోస్. అతడిని ఉరి తీసే సమయానికి ఖుదీరాం బోస్ వయస్సు 18 ఏళ్ల 8 నెలల 8 రోజులు. దేశం కోసం అప్పటి అధికారులును ఎదిరించడం, ఏకంగా చీఫ్‌ జడ్జీనే హత్య చేసేందుకు బాంబు విసిరిన సాహసి ఖుదీరాం బోస్‌.

khudiram bose hanged at mujaffarpur : భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులు ఎంతోమంది ఉన్నారు. కానీ చిన్ననాటే దేశ భక్తిని నరనరాన నింపుకుని భరత మాత దాస్య శృంఖాలను త్రెంచాలనే ఆకాంక్షతో తెల్లదొరలతో పోరాడేందుకు కదలి వచ్చినవారు కూడా చాలామందే ఉన్నారు. వారిలో ఎవరి త్యాగాలను మరచిపోలేం. అటువంటి నవ యువకుడు..దేశం కోసం ప్రాణాలు అర్పించిన నూనూగు మీసాలు నవ విప్లవ వీరుడు. ధీరుడు ఖుదీరాం బోస్‌. 18 సంవత్సరాల వయస్సులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగి ఖుదీరాం బోస్‌. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఉరితాడుని ముద్దు పెట్టుకుని ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ ధీరత్వానికి ఏమాత్రం తీసిపోడు ఈ 18 ఏళ్ల నవ యువ వీరుడు ఖుదీరాం బోస్‌. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీషన్లతో పోరాడిన ఆ యువకుడిని ఉరి తీశారు తెల్లవాళ్లు. కానీ ఉరి తాడు కళ్లముందే కనిపిస్తున్నా ఏమాత్రం అదరలేదు..బెదరలేదు ఖుదీరాం బోస్‌. అతడిని ఉరి తీసేనాటికి ఖుదీరాం బోస్‌ వయస్సు సరిగ్గా 18 సంవత్సరాల.. 8 నెలల.. 8రోజులు.

దేశం కోసం బ్రిటీషర్లతో కొట్లాడి నవ్వుతూ ఉరికంభం ఎక్కిన మహా వీరుడు. చేతిలో భగవద్గీత పట్టుకుని 1908 లో సరిగ్గా ఇదే రోజున (ఆగస్టు 11)ప్రాణాలు అర్పించాడు. దేశం కోసం అప్పటి అధికారులును ఎదిరించడం, ఏకంగా చీఫ్‌ జడ్జీనే హత్య చేసేందుకు బాంబు విసిరడం వంటి ధైర్యసాహసాలు ఖుదీరాం బోస్‌ పోరాట పథంలో ప్రథాన ఘట్టం.

పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌ జిల్లాలో 1889 డిసెంబర్‌ 3 న జన్మించిన ఖుదీరాం బోస్‌.. 6 సంవత్సరాల వయస్సులోనే తల్లిని మరో సంవత్సరంలో తండ్రిని కోల్పోయాడు. దీంతో ఖుదీరాం సోదరి వద్ద పెరిగాడు. మిడ్నాపూర్‌ జిల్లాలో అరబిందో, సిస్టర్‌ నివేదిత వచ్చి చేసిన ప్రసంగాలకు ఆకర్శితుడై విప్లవకారుడిగా మారాడు. 15 ఏండ్ల వయసులోనే అనుశీలన్‌ సమితి వాలంటీర్‌గా పనిచేసి బ్రిటీషర్లకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచుతూ అరెస్టయ్యాడు.

18 ఏళ్ల వయసులో ఖుదీరాం బోస్‌, అతని స్నేహితుడు ప్రఫుల్లా చాకీ కలిసి చీఫ్‌ జడ్జీ డగ్లాస్‌ కింగ్‌ఫోర్డ్‌ను హత్య చేయటానికి యత్నించారు. ఏప్రిల్‌ 30 న ఇంటికి వస్తున్న కింగ్‌ఫోర్డ్‌పై దాడి చేయడానికి బదులుగా పొరపాటున న్యాయవాది కెన్నెడీపై బాంబులు విసిరారు. ఈ ఘటనలో కెన్నెడీ తప్పించుకోగా..అతని భార్య చనిపోయింది.

దీంతో వీరిద్దరిని పట్టుకోవటానికి పోలీసులు భారీగా తరలి రాగా తాము ఎలాగు వారికి చిక్కుతామని ప్రపుల్లా చాకి తనను తాను కాల్చుకుని ప్రాణాలు వదలగా ఖుదీరాం బోస్ మాత్రం పట్టుబడ్డాడు. అతనిని విచారణకు తీసుకెళ్లగా జడ్జీపై హత్యాయత్నానికి గారు ఉరిశిక్ష విధించి ముజఫర్‌పూర్ జైలుకు తరలించారు.ముజఫర్ జైలులోనే అతనిని ఉరి వేశారు. ఉరి వేసే సమయంలో ఖుదీరాం బోస్ చేతిలో భగవద్గీత పట్టుకుని వెళ్లాడు. చేతిలో భగవద్గీతతోనే చిరునవ్వుతో ఉరికంభం ఎక్కిన యోధుడు,ధీరుడు అంటూ అప్పటి వార్తా పత్రికలు రాశాయి ఖుదీరాం బోస్ గురించి.

ఖుదీరాం బోస్ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అతి పిన్న వయస్కుడైన స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరు. అప్పటి నుండి వచ్చిన వార్తాపత్రిక నివేదికలు అతను ముఖం మీద చిరునవ్వుతో ఉరిలోకి వెళ్లినట్లు చెప్పారు. తరువాత, ముజఫర్‌పూర్ జైలు, అతనికి మరణశిక్ష విధించబడింది. అతని మరణం తరువాత ముజఫర్ పూర్ జైలుకు ఖుదీరాం బోస్ పేరు పెట్టారు.

ట్రెండింగ్ వార్తలు