Panjab Incident : మోదీ పర్యటనకు డీజీపీ రాకపోవడమే తొలి భద్రతా ఉల్లంఘన – కిరణ్ బేడీ

ప్రధాని నరేంద్రమోదీ పంజాబ్ పర్యటనలో భాగంగా తలెత్తిన భద్రతా లోపంపై దేశంలోని వివిధ పార్టీలకు చెందిన నేతలతో పాటు, పలువురు ప్రముఖులు స్పందించారు.

Panjab Incident

Panjab Incident : ప్రధాని నరేంద్రమోదీ పంజాబ్ పర్యటనలో భాగంగా తలెత్తిన భద్రతా లోపంపై దేశంలోని వివిధ పార్టీలకు చెందిన నేతలతో పాటు, పలువురు ప్రముఖులు స్పందించారు. శనివారం ఈ ఘటనపై ఐపీఎస్ మాజీ అధికారిని.. పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ స్పందించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్రగా ఆమె అభివర్ణించారు. ప్రధాని పర్యటనలో రాష్ట్ర డీజీపీ లేకపోవడం, హోం సెక్రటరీ హాజరుకాకపోవడం, స్థానిక కలెక్టర్ రాకపోవడం అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు.

చదవండి : PM Modi Convoy : ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం..ఏడాది క్రితమే పక్కా ప్లాన్!

ఇది ప్రధానిపై ఆకస్మిక దాడి చేసేందుకు జరిగిన కుట్ర అని ఆరోపించారు బేడీ. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో రోడ్డు దిగ్బంధనం కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ 15-20 నిమిషాల పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న ప్రధాని బుధవారం ఫిరోజ్‌పూర్‌లో తన కార్యక్రమాన్ని విరమించుకోవాల్సి వచ్చింది.

చదవండి : PM Modi: ప్రధానికి భద్రతా వైఫల్యం అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు