పావలా వడ్డీకే రైతులకు రూ. 3 లక్షల అప్పు

  • Publish Date - March 2, 2020 / 08:03 AM IST

అన్నదాతకు అండగా ఉండడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 25 లక్షల కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు(కేసీసీ) ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద రైతులకు ప్రయోజనం కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది. కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేయాలని భావిస్తుంది. పీఎం కిసాన్ స్కీమ్ కింద ప్రయోజనం పొందే ప్రతి ఒక్క రైతుకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. 

ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న 25లక్షల మంది రైతులకు కార్డులు ఇవ్వాలని అనుకుంటుంది. అసలు కిసాన్ క్రెడిట్ కార్డు ఏంటంటే.. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ఆర్థిక సంస్థల వలలో చిక్కి రైతులు ఇబ్బంది పడకుండా బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించడం ఈ కార్డుల లక్ష్యం. 

ఈ కేసీసీ స్కీమ్ కింద అర్హులైన అన్నదాతకు 4 శాతం వడ్డీకే రుణాలు ఇస్తారు. అంటే పావలా వడ్డీ పడుతుంది. అయితే తీసుకున్న రుణాన్ని కచ్చితంగా చెల్లించాలి. లేదంటే 7 శాతం వడ్డీ పడుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు ప్రకారం.. తీసుకున్న రుణాన్ని కచ్చితంగా చెల్లిస్తే.. అప్పుడు రైతులకు 4 శాతం వడ్డీకే రుణాలు లభిస్తాయి. లేదంటే 7 శాతం వడ్డీ పడుతుంది. 

కిసాన్ క్రెడిట్ కార్డుపై రూ.3 లక్షల వరకు అప్పు తసుకోవచ్చు. రైతులు గతంలో తీసుకున్న అప్పు కరెక్ట్ టైమ్‌‍కి కడితే అప్పు మళ్లీ వస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులు ఎలాంటి తనఖా లేకుండా రూ.1.6 లక్షల వరకు అప్పు పొందవచ్చు.