kobebryantrip : బాస్కెట్ బాల్ ప్లేయర్ కోబ్ బ్రయంట్, కూతురు మృతి

  • Publish Date - January 27, 2020 / 02:28 AM IST

కాలిఫోర్నియాలో తీవ్ర విషాదం నెలకొంది. హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో ప్రముఖ బాస్కెట్ బాల్ ప్లేయర్ కోబ్ బ్రయంట్, కూతురుతో సహా 9 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనతో అందరూ షాక్‌కు గురయ్యారు. తమ అభిమాన క్రీడాకారుడు ఇక లేడనే విషయాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఆయన ఆటను ఇక చూడలేమని విషాదంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

కోబ్ బ్రయంట్ బాస్కెట్ బాల్ క్రీడలో ఎంతో పేరు సంపాదించారు. ఈయనకు 41 సంవత్సరాలు. ఈయన కుమార్తెతో పాటు మరికొందరు కలిసి హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నారు. ప్రమాదవశాత్తు విమానం కూలిపోయింది. దట్టమైన మేఘాల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. 

Read More : మందు బాబులకు షాక్ : నేడూ మద్యం దొరకదు

బ్రంట్ 20 ఏళ్ల కెరియర్‌లో ఎన్నో రికార్డులు సాధించారు. నేషల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ తరపున ఆడి ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచారు. 2012 ఒలింపిక్స్‌లో యూఎస్ టీమ్ తరపున ఆడిన కోబ్..రెండు స్వర్ణపతకాలు గెలుచుకున్నాడు. 2016లో NBA నుంచి ఆల్ టైమ్ స్కోరర్‌గా రిటైర్ అయ్యారు. 18 సార్లు ఆల్ టైమ్ స్టార్‌గా నిలిచారు. కోబ్ మృతికి పలువురు సంతాపం తెలియచేశారు. టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ ఆయన సంతాపం తెలియచేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. నమ్మకలేకపోతున్నట్లు వెల్లడించారు.