వెస్ట్ బెంగాల్ బీజేపీ చీఫ్ పై దాడి

వెస్ట్ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ దిలీప్ ఘోష్‌పై కొంత మంది దుండగులు దాడికి పాల్పడ్డారు. ఇవాళ(ఆగస్టు-30,2019) ఉదయం లేక్ టౌన్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 

ఘోష్ మార్నింగ్ తో పాటుగా చాయ్ పే చర్చా ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వెళ్లిన దిలీప్ ఘోష్ ను చుట్టుముట్టిన దుండగులు ఒక్కసారిగా ఆయనపై దాడి చేశారు. కొందరు బీజేపీ కార్యకర్తలపై కూడా దాడికి పాల్పడ్డారు. వెంటనే అలర్ట్ అయిన బీజేపీ కార్యకర్తలు దిలీప్ ను  అక్కడి నుంచి తరలించారు. దిలీప్ పై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే దాడి చేసి ఉంటారని బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమెదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 
అయితే రెండు రోజుల క్రితం తూర్పు మిద్నాపూర్‌లో పర్యటించిన దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ శ్రేణులపై దాడులు జరుగుతున్న కారణంగా టీఎంసీ శ్రేణులపై దాడులు చేయాలంటూ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీఎంసీ కార్యకర్తలపై దాడులు చేస్తున్న సమయంలో పోలీసులు అడ్డుపడితే వారిపై కూడా దాడి చేయాలంటూ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.