Kolkata Student : జేయూ విద్యార్థికి 3 జాబ్ ఆఫర్లు.. గూగుల్, అమెజాన్ వద్దన్నాడు.. ఫేస్‌బుక్‌లో భారీ ప్యాకేజీ కొట్టేశాడు!

కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీ (JU)కి చెందిన ఒక విద్యార్థికి ఒకేసారి మూడు జాబ్ ఆఫర్లు వచ్చాయి.

Kolkata Student : కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీ (JU)కి చెందిన ఒక విద్యార్థికి ఒకేసారి మూడు జాబ్ ఆఫర్లు వచ్చాయి. అందులో ఒకటి ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. రెండోది ఈకామర్స్ దిగ్గజం అమెజాన్.. అయినా ఈ రెండు జాబ్ ఆఫర్లను రిజెక్ట్ చేశాడు. మెటా (ఫేస్‌బుక్) నుంచి రూ. 1.8 కోట్ల భారీ ప్యాకేజీని కొట్టేశాడు. ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్‌లో నాలుగో సంవత్సరం చదువుతున్న బిసాఖ్ మోండల్ సెప్టెంబర్‌లో లండన్‌కు వెళ్లనున్నాడు.

ఈ ఏడాది జేయూ చెందిన విద్యార్థి అందుకున్న అత్యధిక వేతన ప్యాకేజీ ఇదే కావడం విశేషం. వివిధ ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన 9 మంది విద్యార్థులు రూ.కోటి కన్నా ఎక్కువ వేతన ప్యాకేజీలతో విదేశీ ఉద్యోగాలు పొందారని ఓ నివేదిక పేర్కొంది. ఫేస్‌బుక్ నుంచి జాబ్ ఆఫర్ రావడంతో మోండల్ ఎగిరిగంతేశాడు. తన సంతోషాన్ని లింక్డ్‌ఇన్‌ వేదికగా పంచుకున్నాడు. లండన్ నుంచి గూగుల్, అమెజాన్ జాబ్ ఆఫర్లు వచ్చాయని, బెర్లిన్ నుంచి కూడా తనకు జాబ్ ఆఫర్లు వచ్చినట్లు వెల్లడించాడు.

Kolkata Student Gets 3 Job Offers, Rejects Amazon And Google But Accepts Rs 1.8 Crore Package From Facebook

గత కొన్ని వారాల వ్యవధిలో.. నేను Meta (Facebook) లండన్ నుంచి ఫుల్ టైమ్ జాబ్ ఆఫర్‌లను అందుకున్నాను త్వరలో రెండింట్లో ఒకదానిలో జాయిన్ కానుడడం చాలా సంతోషంగా ఉందన్నాడు. అది నా చిరకాల కోరిక నెరవేరిందని మోండల్ అన్నాడు. ఫేస్‌బుక్‌లో ఉద్యోగంలో చేరేందుకు వచ్చే సెప్టెంబర్‌లో లండన్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు.

కొన్ని రోజుల క్రితమే తనకు జాబ్ ఆఫర్ వచ్చిందన్నాడు. గత రెండేళ్ళలో, కోవిడ్-19 మహమ్మారి సమయంలో తాను అనేక సంస్థలలో ఇంటర్న్‌షిప్ చేసినట్టు తెలిపాడు. అదే తనకు ఇంటర్వ్యూలను ఛేదించడానికి సాయపడిందని చెప్పుకొచ్చాడు. ప్యాకేజీ పరంగా చూస్తే.. గూగుల్, అమెజాన్‌ ఆఫర్ చేసిన ప్యాకేజీ కన్నా ఫేస్‌బుక్‌ ఎక్కువగా ఆఫర్ చేసిందని అందుకే మెటాలో జాబ్ ఎంచుకున్నట్లు మోండల్ చెప్పాడు.

Read Also : Facebook: ఫేస్‌బుక్‌ను వీడనున్న కీలక ఉద్యోగి

ట్రెండింగ్ వార్తలు