కోల్ కతాలో మోడీ, మమత, బీజేపీ, టీఎంసీల స్వీట్లు

Kolkata sweet shop : కోల్ కతాలో ఎన్నికల ఫీవర్ నెలకొంది. త్వరలోనే వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..పార్టీ నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. మరోసారి అధికారపీఠంపై కూర్చోవాలని టీఎంసీ, ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి.

తాము అధికారంలో ఉంటే పాలన ఉంటుందో ఓటర్లకు తెలియచేస్తున్నారు. దీంతో రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే..కోల్ కతాలోని Balaram Mallick Radharaman Mallick పేరిట ఉన్న చెందిన స్వీట్ షాపులో ఉన్న స్వీట్లు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. బెంగాలీ తీపి వంటకాల్లో sandesh ఒకటి. అందులో భాగంగా ప్రధాన పార్టీలకు చెందిన నేతలు, పార్టీల చిహ్నాలతో స్వీట్లు తయారు చేయించారు. బెంగాలి భాషలో Khela Hobe, Jai Shri Ram అక్షరాలు ఉండడం విశేషం.

క్రికెట్, ఫుట్ బాల్ ప్రపంచ కప్ సందర్భంగా…స్వీట్లను తయారు చేయడం జరిగిందని, అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ ఎన్నికలు..దీనిని హైలెట్ చేయాలని అనుకుంటున్నట్లు దుకాణం యజమాని సుదీప్ మల్లిక్ వెల్లడించారు. వినూత్నంగా ఉన్న ఈ స్వీట్లను చూసి వినియోగదారులు ఆకర్షితులయ్యారని తెలిపారు. మార్చి 27వ తేదీ నుంచి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 8 దశల్లో పోలింగ్ జరుగనుంది. మే 02వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ట్రెండింగ్ వార్తలు