Traffic Police in Rain: వర్షంలో మనుషులకే కాదు.. కుక్కలకు కూడా సాయం చేస్తున్న ట్రాఫిక్ పోలీస్

వర్షం పడుతున్నా నిలబడి డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ పోలీస్ అధికారుల ఫొటోలు చాలా సార్లు చూశాం. కానీ, మూగ జీవాల మాటేంటి అనుకున్న ట్రాఫిక్ అధికారి సిగ్నల్స్ చూపిస్తూ..

Traffic Police in Rain: వర్షం పడుతున్నా నిలబడి డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ పోలీస్ అధికారుల ఫొటోలు చాలా సార్లు చూశాం. కానీ, మూగ జీవాల మాటేంటి అనుకున్న ట్రాఫిక్ అధికారి సిగ్నల్స్ చూపిస్తూ.. వీధి కుక్కలకు ఆశ్రయం కల్పించాడు. తనతో పాటు ఉన్న గొడుగులోకి వాటిని కూడా రానిచ్చి వర్షానికి తడవకుండా కాపాడాడు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ చిత్రం నెటిజన్ల మనసులు దోచుకుంది.

పశ్చిమ బెంగాల్‌ పోలీసులు దీని గురించి ఇలా చెబుతున్నారు. కోల్‌కతాలోని పార్క్‌ సర్కస్‌ సెవన్‌ పాయింట్‌ వద్ద తరుణ్‌కుమార్‌ మండల్‌ అనే ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ విధులు నిర్వర్తిస్తుండగా.. వర్షం మొదలైంది. తనతో పాటు ఉన్న గొడుగు పట్టుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నాడు.

…………………………………….: గోవాపై టీఎంసీ కన్ను..రంగంలోకి పీకే..రా రమ్మంటున్న సీఎం సావంత్

అదే సమయంలో పరుగెత్తుకుంటూ వచ్చిన కుక్కలను ఆప్యాయంగా గొడుగుతో రక్షణ ఇచ్చారు. దీన్ని గుర్తించిన ఫొటోగ్రాఫర్‌ వెంటనే కెమెరాను క్లిక్‌మనిపించారు. ట్రాఫిక్ పోలీస్ అధికారి తరుణ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గొడుగే కాదు.. కుక్కలకు రక్షణగా దాన్ని పట్టిన తరుణ్‌ మనసు కూడా పెద్దదే అంటూ అభినందనలు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు