Kumbh Monalisa
MahaKumbh Monalisa : ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో ముత్యాల దండలను విక్రయించే యువతి మోనాలిసా భోస్లే గురించే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇంటర్నెట్‌లో ఇప్పుడు ఈ మోనాలిసా గురించే చర్చించుకుంటున్నారు. గోధుమ రంగు కళ్లు, కాంతివంతమైన అందంతో అందరిని ఆకట్టుకున్న యువతి ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. దాంతో అందరూ ఆమె దగ్గరకు వచ్చి సెల్ఫీలు, వీడియోలు తీయడం మొదలుపెట్టారు. అదే ఆమెకు అతిపెద్ద సమస్యగా మారింది.
Read Also : Narayana Murthy : ’70 గంటల పని’పై నారాయణమూర్తి వివరణ.. ఎవరినీ ఎవరూ బలవంతం చేయలేరు..!
మోనాలిసా తండ్రి ప్రకారం.. స్వస్థలం ఖర్గోన్ జిల్లాలోని మహేశ్వర్. ఆమె కుటుంబం మొత్తం ఇక్కడే నివసిస్తోంది. ముత్యాల దండలు అమ్మడం ద్వారానే డబ్బు సంపాదించుకుంటున్నారు. మోనాలిసా కుటుంబం దాదాపు 35 నుంచి 40 ఏళ్లుగా మహేశ్వర్‌లో నివసిస్తోంది. మోనాలిసా కుటుంబం మహేశ్వర్ ఘాట్ వద్ద దండలు విక్రయిస్తుంది. మోనాలిసా తన అందంతో సోషల్ మీడియాలో ఫేమస్ కావడంతో ఆమె ముత్యాల దండల వ్యాపారం ఆగిపోయింది.
Kumbh Monalisa
అక్కడికి వచ్చినవారంతా ఆమెను చూసేందుకు వస్తున్నారు. దాంతో తన దండలను అమ్ముకోలేని పరిస్థితి ఎదురైంది. మోనాలిసాను అందరూ చుట్టుముడుతూ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. దీని కారణంగా మోనాలిసా ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్లిపోయింది. ఆమె తండ్రి యువతి మోనాలిసాను ఇండోర్‌లోని తన ఇంటికి పంపించేశాడు. ముత్యాల దండల అమ్మకాలు తగ్గిపోవడంతో ఆమె తండ్రి ఇంటికి పంపేయాలని నిర్ణయించారు.
కుంభమేళా నుంచి ఇంటికి తిరిగి వెళ్లిన మోనాలిసా :
ఇదే విషయాన్ని సోషల్ మీడియా యూజర్ సచిన్ గుప్తా ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. ఇండోర్ ‘మోనాలిసా’ తిరిగి ఇంటికి చేరుకుందని తెలిపాడు. కుంభమేళాకు వచ్చేవారిలో కొంతమంది ఆమె దండలు కొంటున్నారు. మిగతా వారంతా ఆమెతో సెల్ఫీలు, వీడియోలు దిగేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని తెలిపాడు. అందుకే ఆమె తండ్రి ఇంటికి పంపించాలని నిర్ణయం తీసుకున్నట్టు సచిన్ చెప్పాడు.
యువతి మోనాలిసాను ముద్దుగా ‘బ్రౌన్ బ్యూటీ’గా నెటిజన్లు పిలుచుకుంటున్నారు. ఆమె అమాయకపు చూపు, ఆకర్షణీయమైన అందం ఇంటర్నెట్ యూజర్లను ఆకట్టుకుంది. నీలి రంగు కళ్లతో కనిపించే మోనాలిసా భోస్లే కుంభమేళాకు వచ్చినవారిని ఆకర్షించింది. అప్పుడు ఈ యువతికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోకు ఏకంగా 15 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
మోనాలిసా నవ్వు, ఆమె అభినయం ఎంతోమందిని ఆకర్షించింది. దాంతో ఇంటర్నెట్‌లో ఓవర్‌నైట్ స్టార్ బ్యూటీగా మారిపోయింది. అదే ఆమె దండల వ్యాపారానికి అడ్డుపడింది. కుంభమేళాకు వచ్చే యూట్యూబర్లు ఆమె కోసమే వస్తున్నారు. ఆమెతో ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. దండల వ్యాపారం దెబ్బతినడంతో ఆమె తండ్రి ఇండోర్‌లోని తన ఇంటికి పంపాడు.
Read Also : RRB Group D : ఆర్ఆర్‌బీలో 32,438 పోస్టులకు నోటిఫికేషన్.. పది పాసైతే అప్లయ్ చేసుకోవచ్చు!