KV Subramanian : సీఈఏ పదవికి కేవీ సుబ్రమణియన్ రాజీనామా

చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్(CEA)పదవి నుంచి కేవీ సుబ్రమణియన్ తప్పుకున్నారు.

Cea

KV Subramanian చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్(CEA)పదవి నుంచి కేవీ సుబ్రమణియన్ తప్పుకున్నారు. భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా తన మూడేళ్ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో సీఈఏ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సుబ్రమణియన్ శుక్రవారం ఓ ట్వీట్ లో తెలిపారు.

దేశానికి సేవ చేయడం గొప్ప అదృష్టమని మరియు తనకు అద్భుతమైన మద్దతు మరియు ప్రోత్సాహం లభించిందని కేవీ సుబ్రమణియన్ తెలిపారు. ప్రొఫెసర్ గా విధులు నిర్వహించేందుకు తిరిగి అకాడమీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.