ఉన్నట్టుండి లక్షాధికారి అయిపోయిన దినసరి కూలీ.. ఎలాగంటే?

పొలాల్లో ట్రాక్టర్లు నడిపే పని చేసుకుంటూ జీవిస్తుంటాడు రాజు గోండు.

Panna Diamond Mining

Labourer finds diamond: రెక్కాడితే గానీ డొక్కాడదు.. కూలీగా పనిచేస్తూ రోజుకి రూ.300 సంపాదిస్తుంటాడు అతడు. అటువంటి వ్యక్తి జీవితమే మారిపోయింది ఇప్పుడు. రూ.80 లక్షల విలువజేసే వజ్రం అతడికి దొరికింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ అదృష్టవంతుడు రాజు గోండు (40) మీడియాకు వివరించి చెప్పాడు.

మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ పన్నా గనులలో ఓ వజ్రాన్ని వెలికితీశానని రాజు గోండు అన్నాడు. గత వారం గనుల వద్ద తనకు 19.22 క్యారెట్ల వజ్రం దొరికిందని తెలిపాడు. అది ప్రభుత్వ వేలంలో దాదాపు రూ.80 లక్షలు పలుకుతుంది.

మధ్యప్రదేశ్‌లోని రైతుల పొలాల్లో ట్రాక్టర్లు నడిపే పని చేసుకుంటూ జీవిస్తుంటాడు రాజు గోండు. అలాగే, ఇతర కూలీ పనులు చేస్తుండేవాడు. వారం క్రితం తన సోదరుడితో కలిసి 690 చదరపు అడుగుల ప్రభుత్వ భూమిలో బంగారం తవ్వే పనికి వెళ్లారు. అక్కడే రాజుకు మెరుస్తూ ఓ వస్తువు కనపడింది. అది వజ్రమేనని తాను భావించానని, దాన్ని తీసుకున్నానని చెప్పాడు.

తన సోదరుడు రాకేశ్ గోండుతో కలిసి రాజు గోండు వెంటనే స్థానిక పన్నా డైమండ్ ఆఫీసుకి తీసుకెళ్లాడు. ఆ వజ్రం 19.22 క్యారట్లదని, రూ.80 లక్షల విలువ ఉంటుందని అనుపమ్ సింగ్ అనే అధికారి తెలిపారు. 1961లో ఒకరికి 54.55 క్యారెట్ల వజ్రం దొరికిందని, ఆ తర్వాత 2018లో మరొకరికి 42 క్యారెట్ల వజ్రం దొరికిందని చెప్పారు. ఇప్పుడు మళ్లీ రాజు గోండుకి వజ్రం దొరికిందని అన్నారు.

Also Read: వీడిని ఏం చేసినా పాపం లేదు..! రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్, రాళ్లు పెట్టి ప్రజల ప్రాణాలతో యూట్యూబర్ చెలగాటం

ట్రెండింగ్ వార్తలు