బోర్డర్ లో భయపడుతున్న చైనా…అక్రమంగా భారత్ లడఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించందట

China On Ladakh Union territory లడఖ్ ను కేంద్ర పాలితప్రాంతంగా చైనా గుర్తించదని ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి జావొ లిజియన్ తెలిపారు. అక్రమంగా లడఖ్ ను కేంద్రపాలితప్రాంతంగా భారత్ ప్రకటించిందని తెలిపారు. భారత రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ సోమవారం సరిహద్దుల్లో 44 కీలకమైన బ్రిడ్జిలను ప్రారంభించిన నేపథ్యంలో చైనా నుంచి ఈ మేరకు ఇవాళ ఈ ప్రకటన వచ్చింది. ఈ చర్యను ఖండిస్తున్నామని..లడఖ్ ను భారత్ అక్రమంగా కేంద్రపాలితప్రాంతంగా ప్రకటించిందని చైనా పేర్కొంది.



చైనా విదేశాంగశాఖ ప్రతినిధి జావొ లిజియన్ మాట్లాడుతూ…మొదట ఓ విషయాన్ని సృష్టం చేయాలనుకుంటున్నాను. లడఖ్ ను కేంద్రపాలిప్రాంతంగా చైనా గుర్తించదు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ ని కూడా. చట్టవిరుద్దంగా భారత్ లడఖ్ ను కేంద్రపాలిప్రాంతంగా ప్రకటించింది. సరిహద్దు ప్రాంతంలో సైనిక వివాదానికి ఉద్దేశించిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి చైనా వ్యతిరేకం. ఇరుపక్షాల ఏకాభిప్రాయం ఆధారంగా, ఉద్రిక్తతలు మరింత పెంచే చర్య తీసుకోకూడదు. అది పరిస్థితిని సులభతరం చేసే ప్రయత్నాలను కూడా బలహీనపరుస్తుందని తెలిపారు.



చైనా-భారత్ దేశాల మధ్య వివాదం కారణంగానే వాస్తవాధీనరేఖ(LAC)వెంబడి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వర్క్ పై భారత్ ఎక్కువగా చేపడుతుందంటూ జావొ లిజియన్ ఆరోపించారు. కొంతకాలంగా బోర్డర్ లో భారత్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ను వేగవంతం చేసిందని మరియు మిలటరీని ఎక్కువగా అక్కడ మొహరిస్తోందని…రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటానికి ఇదే మూలం అని లిజియన్ అన్నారు.



మరోవైపు, వాస్తవాధీన రేఖ వెంబడి వీలైనంత త్వరగా బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలని భారత్​-చైనా అంగీకరించినట్లు ఇవాళ భారత సైన్యం తెలిపింది. ఇరు దేశాల మధ్య సోమవారం జరిగిన చర్చల్లో.. సరిహద్దు ఉద్రిక్తతలపై నిర్మాణాత్మకంగా, లోతుగా సమాలోచనలు చేసినట్లు స్పష్టం చేసింది. సమస్యల పరిష్కారానికి సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు నిర్వహించడానికి ఇరు దేశాలు సుముఖంగా ఉన్నట్లు పేర్కొంది. విభేదాలను వివాదాలుగా మార్చకూడదని, సరిహద్దుల్లో సంయుక్తంగా శాంతిని నెలకొల్పాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు