Viral Video: లేడీ బాహుబలి.. పెళ్లికూతురు ఇలా కూడా తయారవుతుందా? ఎందుకిలా ముస్తాబైందో తెలుసా?

వేషధారణ, అలంకరణ ఇలా ఉంటే పెళ్లికొడుకు భయపడడా? అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Viral Video

అమ్మాయిలు ఎలా ఉంటారు? అందులోనూ పెళ్లికూతురి లుక్‌ అంటే మనకు గుర్తుకు వచ్చేది ఏంటి? చాలా సుకుమారంగా, సిగ్గుపడుతూ పెళ్లికూతురు కనపడుతుంది. అయితే, కర్ణాటకకు చెందిన చిత్ర అనే అమ్మాయి మాత్రం తన కండలను చూపెడుతూ కనపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

సాంప్రదాయ కంజివరం చీరలో ఆమె పెళ్లికూతురిగా ముస్తాబైంది. నగలు పెట్టుకుని బాడీబిల్డర్‌లా పోజులు ఇచ్చింది. చిత్ర ఓ ఫిట్‌నెస్ ట్రైనర్‌. అందుకే ఇలా పెళ్లి దుస్తుల్లోనూ తన ఫిట్‌నెస్‌ ప్రదర్శించింది. ఎంతో గర్వంగా ఆమె తన అందాన్ని, కండలను ఒకేసారి చూపెడుతుండడం నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఆమె పెళ్లికూతురిలా తయారై కండలు కూడా ప్రదర్శించడంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

పెళ్లి వంటి వేడుకలకి నగలు పెట్టుకుని తయారు అవ్వడం సాధారమేకానీ, ఇలా కండలు ప్రదర్శించడం ఏంటని కొందరు కామెంట్లు చేశారు. అది ఆమెలోని ఆత్మవిశ్వాసాన్ని చూపెడుతోందని కొందరు అన్నారు.

పెళ్లికూతురు ముస్తాబు ఎలా అవ్వాలో ఈమెను చూసి నేర్చుకోవాలని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఇది ట్రెండింగ్ మేకప్ స్టైల్‌గా మారుతుందని కొందరు కామెంట్లు చేశారు. వేషధారణ, అలంకరణ ఇలా ఉంటే పెళ్లికొడుకు భయపడడా? అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. లేడీ బాహుబలిలా ఆమె తయారైందని కొందరు అంటున్నారు.