Bengaluru : ట్రాఫిక్‌లో చిక్కుకుంటే ఏం చేయాలి? ఈ ఐడియా భలే ఉందే..

ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే ఆ కష్టాలు మామూలుగా ఉండవు. ఆరోజుకి అనుకున్న షెడ్యూల్ తారుమారు అవుతుంది. ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఆ సమయం ఆదా చేయాలంటే ఏం చేయాలి? చదవండి.

Bengaluru

Bengaluru : బెంగళూరులో ట్రాఫిక్ ఇబ్బందుల గురించి తెలియంది కాదు. అక్కడి ట్రాఫిక్‌లో జనం ఇబ్బంది పడుతున్న వీడియోలు ఈ మధ్యకాలంలో చాలానే వైరల్ అయ్యాయి. మరో వీడియో బయటకు వచ్చింది.

Actor Madhavan : బెంగళూరు ఎయిర్ పోర్టుపై మాధవన్ ట్వీట్.. స్పందించిన ప్రధాని మోడీ

ట్రాఫిక్‌లో చిక్కుకుంటే ఆరోజు షెడ్యూల్ మొత్తం మారిపోతుంది. అనుకున్న పనులన్నీ ఆలస్యం అవుతాయి. ట్రాఫిక్ లోంచి బయటపడటం అంటే అంత సుళువైన పని కాదు.. కానీ ఆ సమయాన్ని ఎలా వాడుకోవాలి? అంటే.. గతంలో బెంగళూరు ట్రాఫిక్‌లో బైక్ మీద కూర్చుని ల్యాప్ టాప్‌లో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్న మహిళ వీడియో వైరల్ అయ్యింది. తాజాగా మరో వీడియో బయటకు వచ్చింది. ప్రియ అనే మహిళ ట్రాఫిక్ జామ్‌లో తన కారులో కూర్చుని బఠానీలు ఒలుచుకుంటున్న వీడియో షేర్ చేసింది.

Bengaluru : బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక రూ.40 వేలు ఆదా అయ్యాయట.. ఓ వ్యక్తి పోస్ట్ వైరల్

ట్రాఫిక్ జామ్‌లో కూడా మహిళ తన పనిని ఎలా ఉపయోగించుకుందో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ప్రియ ట్విట్టర్‌లో ‘ పీక్ ట్రాఫిక్ సమయాల్లో ఇలాంటి పనులు చేసుకోవడం’ అనే శీర్షికతో పోస్ట్ పెట్టింది. ‘దీనిని మా యజమానికి పంపిస్తున్నాను’ అని ఒకరు.. ‘బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే సిల్క్ బోర్డ్ నుండి ఇందిరానగర్‌కి వెళ్లే లోపు మొక్కలు పెరుగుతాయని’ మరొకరు కామెంట్లు చేసారు. ఇక ఈ  పోస్టును బట్టి ట్రాఫిక్ కష్టాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రియ పోస్ట్ వైరల్ అవుతోంది.