Lakhimpur
Union minister Ajay Mishra Teni : ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ కు టైం దగ్గర పడుతోంది. విజయం సాధించాలని పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం వైపు అందరి దృష్టి నెలకొంది. అధికారంలో కొనసాగుతున్న బీజేపీకి సమాజ్ వాదీ పార్టీ గట్టి పోటీనిస్తోంది. ప్రచారపర్వంలో ఇరు పార్టీలు దూసుకపోతున్నాయి. ఇదిలా ఉంటే…కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై పోటీ చేస్తానని ప్రకటించారు ఓ రైతు. అయితే.. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాదు. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం జరుగుతుందని తెలిపాడు.
Read More : Cold Winds : రాష్ట్రంలో పెరుగుతున్న చలి-తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
2024లో యూపీలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి అజయ్మిశ్రాపై పోటీ చేస్తానని లఖింపుర్ ఖేరీ ఘటనలో మృతిచెందిన రైతు నచతార్ సింగ్ కుమారుడు జగదీప్ సింగ్ ప్రకటించారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కోరాయని.. లోక్‌సభ ఎన్నికల్లోనే పోటీ చేయాలనే ఉద్దేశంతోనే వారి ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు జగదీప్ సింగ్ తెలిపారు. అయితే తన కుటుంబంలో ఎవరికీ రాజకీయ నేపథ్యం లేదన్నారు జగదీప్.
Read More : Statue of Equality : శ్రీరామానుచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు.. ఐదో రోజు.. పరమేష్టి, వైభవేష్టి
తాను ఏ పార్టీకీ మద్దతు ఇవ్వడం లేదని, రైతు నాయకుడు తేజేందర్ సింగ్‌కు ప్రస్తుతం తాము మద్దతుగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా కేంద్రంపై జగదీప్ మండిపడ్డారు. బ్రాహ్మణుల ఓటు బ్యాంకు కోసమే అజయ్ మిశ్రాను కేంద్రం పదవి నుంచి తొలగించలేదన్నారు. మిశ్రా పదవిలో ఉన్నంతకాలం తమకు న్యాయం జరగదని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది అక్టోబర్ 3న లఖింపుర్‌లో నిరసన తెలియజేస్తున్న రైతులపైకి మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం చెలరేగిన హింసలో ఓ జర్నలిస్ట్ సహా నలుగురు ప్రాణాలు కోల్పోయరు. ఆశిష్ మిశ్రా సహా పలువురిని సిట్ అరెస్టు చేసింది. ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రా ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.