×
Ad

POCSO Cases : ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో లక్షలాది పోక్సో కేసులు పెండింగ్.. పరిష్కారానికి 9 నుంచి 25ఏళ్లు పట్టే అవకాశం

ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో కేసు నమోదు అయినప్పటి నుంచి ఒక ఏడాదిలోగా విచారణను ముగించి, దోషులను శిక్షించాలి.

  • Published On : December 10, 2023 / 08:14 AM IST

fast track courts

POCSO Cases Pending : ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో లక్షలాది పోక్సో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. బాలలపై లైంగిక నేరాల కేసులు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో లక్షలాదిగా పెండింగ్ లో ఉన్నాయి. కొత్త కేసులు నమోదు కాకుండా, పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించాలంటే కనీసం తొమ్మిదేళ్లు పట్టే అవకాశం ఉంది.

అరుణాచల్ ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో పెండింగ్ కేసుల పరిష్కారానికి కనీసం 25 ఏళ్లు పడుతుందని ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ ఫండ్(ఐసీపీటీ) నివేదిక పేర్కొంది. 2023 జనవరి 31వ తేదీ నాటికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో 2,43,237 పోక్సో కేసులు నమోదైనట్లు తెలిపింది.

Files Missing : తెలంగాణ పుశుసంవర్ధక శాఖలో ఫైల్స్ మాయం.. కిటికీ గ్రిల్స్ తొలగించి ఎత్తుకెళ్లిన దుండగులు

ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో కేసు నమోదు అయినప్పటి నుంచి ఒక ఏడాదిలోగా విచారణను ముగించి, దోషులను శిక్షించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో మొత్తం 2,68,038 కేసులు కాగా, వీటిలో కేవలం 8,909 కేసుల్లో మాత్రమే దోషిత్వ నిర్ధారణ జరిగిందని ఐసీపీటీ వెల్లడించింది.