Lakshmi, Lord Ganesh photos to be printed on India's currency notes
Lakshmi, Lord Ganesh photos to be printed on India’s currency notes : భారత కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేషుడి బొమ్మలు ముద్రించాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కొత్తగా ముద్రించే కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేషుడి బొమ్మలు ముద్రించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇండోనేషియా ఓ ముస్లిం దేశం..అక్కడ హిందువులు కేవలం రెండు శాతం మాత్రమే ఉంటారు. అటువంటి ఇండోనేషియా కరెన్సీపై హిందూ దేవుడైన గణేషుడు బొమ్మను ముద్రించారని..అటువంటిది మన భారత కరెన్సీపై దేవతల బొమ్మలు ముద్రించాలని కోరారు.
పెద్ద పెద్ద్ వ్యాపారవేత్తలు కూడా తమ ఇళ్లల్లో గణపతి, లక్ష్మీదేవిలను పూజిస్తారు…మనం ప్రతీరోజు ఉదయం లేవగానే దేవుళ్లనుతలచుకుని పనులు ప్రారంభిస్తాం. ప్రతీ పూజలోను గణేషుడు పూజే మొదటిగా చేస్తాం. సుఖశాంతులు…ధన ధాన్యాలు ఇవ్వాలని లక్ష్మీదేవిని పూజిస్తాం. అటువంటి దేవుళ్ల బొమ్మలు కరెన్సీమీద కూడా ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నానని తెలిపారు కేజ్రీవాల్. కొత్తగా ముద్రించే కరెన్సీ నోట్లపై గణపతి, లక్ష్మీదేవిల బొమ్మలు ముద్రించాలని ప్రధాని మోడీకి..కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాని తెలిపారు. మన కరెన్సీ నోట్లపై ఒకవైపు గాంధీ బొమ్మను అలాగే ఉంచి..రెండోవైపు గణపతి, లక్ష్మీదేవిల బొమ్మలు ముద్రించాల్సిందిగా కోరుతున్నానని తెలిపారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికి ముందుకు వెళ్లటానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని..అలా జరగటానికి దేవతల ఆశీర్వాదం కూడా మనకు ఉండాలని అలా ఉండాలంటే కరెన్సీపై దేవుళ్ల బొమ్మల్ని ముద్రించాలని కోరారు.
కాగా కరెన్సీ నోట్ల మీద ఆర్బీఐ గాంధీజీ బొమ్మను ముద్రిస్తుంది. అయితే అప్పుడప్పుడు గాంధీజీ బదులు అంబేడ్కర్ బొమ్మను ముద్రించాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తుంటారు. కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం మరో అడుగు ముందుకేసి కరెన్సీపై దేవుళ్ల బొమ్మల్ని ముద్రించాలని కోరటం సంచలనంగా మారింది.ఏకంగా కరెన్సీ నోట్ల మీద గాంధీజీ బొమ్మ పక్కనే.. వినాయకుడు, లక్ష్మీ దేవిల బొమ్మలను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఆఖరికి ఇండోనేషియా వంటి పరాయి దేశాల్లో కూడా కరెన్సీ నోట్ల మీద వినాయకుడి బొమ్మ ముద్రిస్తారని.. మన కరెన్సీపై కూడా లక్ష్మీ దేవి, గణేషుడి బొమ్మలు ఉంటే దేశం ఇంకా సుసంపన్నమవుతుందని అంటున్నారు కేజ్రీవాల్.
I appeal to the central govt & the PM to put the photo of Shri Ganesh Ji & Shri Laxmi Ji, along with Gandhi Ji's photo on our fresh currency notes, says Delhi CM & AAP national convenor Arvind Kejriwal pic.twitter.com/t0AWliDn75
— ANI (@ANI) October 26, 2022