Congress (1)
Lal Bahadur Shastri Son: మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు సునీల్ శాస్త్రి కాంగ్రెస్‌లో చేరారు. సునీల్ శాస్త్రి బీజేపీని వీడి మంగళవారం(28 డిసెంబర్ 2021) కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో శాస్త్రి పార్టీ సభ్యత్వం పుచ్చుకున్నారు.
సునీల్ శాస్త్రి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత, ప్రియాంక గాంధీ ట్వీట్ చేస్తూ, “కాంగ్రెస్ సైనికుడు, భారత మాజీ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు శ్రీ సునీల్ శాస్త్రి గారిని ప్రేమతో కలవడానికి కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం కంటే మంచి సందర్భం ఏముంటుంది.” అంటూ ట్వీట్ చేశారు.
ఈ సంధర్భంగా అన్నీ విషయాలపై చర్చించామని, కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నామని, మేము గెలుస్తాము అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. సునీల్ శాస్త్రి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ఒకప్పుడు క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు, పద్నాలుగు సంవత్సరాలు వివిధ హోదాల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారిగా పనిచేశాడు శాస్త్రి.