Encounter (1)
Pulwama Encounter ఇటీవల శ్రీనగర్ లో పౌరుల హత్యల్లో ఇన్వాల్వ్ అయిన లష్కర్ ఏ తోయిబాఉగ్రవాది బషీర్ షేక్ ఇవాళ పుల్వామా ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. పుల్వామాలోని వహిబగ్ ఏరియాలో ఉగ్రవాదులు ఉన్న సమాచారం అందుకున్న భద్రతాబలగాలు శుక్రవారం ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించాయి.
ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతాబలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదులు-భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో శ్రీనగర్ కు చెందిన లష్కర్ ఉగ్రవాది బషీర్ షేక్ హతమయ్యాడు. ఎన్ కౌంటర్ స్థలం నుంచి ఏకే-47 రైఫిల్ సహా పేలుడు పదార్థాలు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా,ఈ నెల 2న శ్రీనగర్ లో పవర్ డెవలప్ మెంట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగిగా పనిచేసే మొహమ్మద్ షపీ దార్ అనే వ్యక్తిని తుపాకీతో కాల్చి బషీర్ షేక్ హత్య చేశాడని జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు.
ALSO READ కత్తితో పలుమార్లు పొడిచి..బ్రిటన్ ఎంపీ దారుణ హత్య