Manpreet Singh: తండ్రికి చివరిసారి సెల్యూట్ చేసిన ఏడేళ్ల బాలుడు

సైనిక లాంఛనాలతో మన్‌ప్రీత్ సింగ్‌ అంత్యక్రియలు ఇవాళ జరిగాయి. కడసారి చూడడానికి..

Col. Manpreet Singh son

Manpreet Singh – last rites: కల్నల్ మన్‌ప్రీత్ సింగ్‌కు ఆయన కుమారుడు కబీర్ (7) చివరిసారి సెల్యూట్ చేశాడు. జైహింద్ పాపా అని నినదించాడు. జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఈ నెల 13న ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు.

ఆయన అంత్యక్రియలు పంజాబ్ లోని మొహాలీ, ముల్లన్పూర్ గరీబ్దాస్ లో జరిగాయి. అంతకుముందు ఆయన పార్థివ దేహానికి పలువురు నివాళులు అర్పించారు. ఆ సమయంలో మన్‌ప్రీత్ సింగ్‌కు ఆయన కుమారుడు కబీర్ ఆర్మీ యూనిఫాంలో తండ్రికి సెల్యూట్ చేశాడు.

మరో పాప (మన్‌ప్రీత్ సింగ్‌ బంధువు కుటుంబంలోని అమ్మాయి) కూడా మన్‌ప్రీత్ సింగ్‌ పార్థివ దేహానికి సెల్యూల్ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. మన్‌ప్రీత్ సింగ్‌ ను కడసారి చూడడానికి ఆయన సొంత గ్రామం భరౌంజియన్ లోని ఆయన ఇంటికి ఇవాళ ఉదయం నుంచి చాలా మంది వచ్చారు. సైనిక లాంఛనాలతో మన్‌ప్రీత్ సింగ్‌ అంత్యక్రియలు జరిగాయి.

Pakistan nukes: పాక్‌లో మరిన్ని విధ్వంసకర అణు బాంబులు.. ఉపగ్రహ చిత్రాల ద్వారా సంచలన నిజాలు