Lata Mangeshkar: మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో లతామంగేష్కర్ అంత్యక్రియలు

లతా జీ కనుమూసిందని తెలియగానే ప్రధాని మోదీ సైతం నివాళులర్పించారు. కొన్ని దశాబ్దాల పాటు గాత్రంతో మెప్పించారు లతా జీ. ఆమె భౌతిక కాయానికి ప్రభుత్వ అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు...

Lata Mangeshkar: భారత రత్న లతా మంగేష్కర్ మరణం పట్ల యావత్ భారతం సంతాపం వ్యక్తం చేస్తుంది. 92ఏళ్ల వయస్సున్న ఆమె మరణానికి సినీ లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. లతా జీ కనుమూసిందని తెలియగానే ప్రధాని మోదీ సైతం నివాళులర్పించారు. కొన్ని దశాబ్దాల పాటు గాత్రంతో మెప్పించారు లతా జీ.

ఆమె భౌతిక కాయానికి ప్రభుత్వ అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరపనుంది మహారాష్ట్ర ప్రభుత్వం.

మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ జ్ఞాపకార్థంగా రెండు రోజుల పాటు జాతీయ సంతాపదినాలు కూడా ప్రకటించనున్నారు. ఉదయం 11గంటల సమయంలో పెద్దార్ రోడ్ లోని ఆమె నివాసానికి లతామంగేష్కర్ భౌతికాయాన్ని తీసుకొస్తారు.

మధ్యాహ్నం 12 నుంచి 3 గంటలవరకు పార్థివదేహానికి నివాళి అర్పించేందుకు వీలుగా ప్రజలకు అనుమతి కల్పించారు. ఆ తర్వాత అంతిమయాత్ర మొదలవుతుంది.

Read Also: గాయకులు ఎందరొచ్చినా ఆమె లోటును తీర్చలేరు – సీఎం కేసీఆర్

మాయదారి మహమ్మారి కరోనా మరో భారత ఆణిముత్యాన్ని మనకి దూరం చేసింది. గానకోకిలగా యావత్‌ భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగిన లతా మంగేష్కర్ ఇకలేరు. కరోనాతో జనవరి 11న ఆసుపత్రిలో చేరిన లతాజీ.. చికిత్స పొందుతూనే ఆదివారం ఉదయం తుది శ్వాసవిడిచారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్నట్లుగా ప్రకటించినా ముంబయిలోని బ్రీచ్ క్యాడీ ఆసుపత్రిలో చికిత్సకి రెస్పాండ్ కాలేక మృతి చెందారు.

ట్రెండింగ్ వార్తలు