ఎన్సీపీ పక్ష నేత నేనే..లేఖ అందించిన జయంత్ పాటిల్

  • Publish Date - November 26, 2019 / 05:19 AM IST

మహారాష్ట్ర ఎన్సీపీ శాసనసభా పక్షనేతగా తాను ఎన్నికైనట్లు జయంత్ పాటిల్  శాసనసభ కార్యదర్శి రాజేంద్రభగవత్ కు లేఖ అందచేశారు. లేఖ అందిన విషయాన్ని శాసనసభ కార్యదర్శి ధృవీకరించారు. కాగా లేఖపై నిర్ణయం తీసుకోవల్సింది శాసనసభ స్పీకర్ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్ర స్పీకర్ ఎన్నిక జరగనందున  ఎన్సీపీ శాసనసభ పక్షనాయకుడి ఎన్నికపై నిర్ణయాన్ని స్పీకరు తర్వాత తీసుకుంటారని రాజేంద్ర భగవత్ తెలిపారు.

కాగా …..మహారాష్ట్రలో ఫడ్నవీస్‌ ప్రభుత్వం బుధవారం, నవంబర్ 27సాయంత్రం 5 గంటల్లోగా  బలపరీక్ష  నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫడ్నవిస్ సర్కార్ కు సుప్రీంకోర్టు 24గంటల సమయం ఇచ్చింది.  ఇందుకోసం వెంటనే ప్రొటెం స్పీకర్ ను నియమించాలని కోర్టు ఆదేశించింది. బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోర్టు చెప్పింది.