Leopard Attack: బాలికను లాక్కెళ్లి చంపిన చిరుత

చిరుత దాడిలో నాలుగేళ్ళ చిన్నారి మృతి చెందిన ఘటన జమ్మూకాశ్మీర్ లో చోటుచేసుకుంది. బుద్గామ్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి చొరబడిన చిరుత నాలుగేళ్ళ చిన్నారిని లాక్కెళ్ళింది. ఇంట్లోకి చిరుత వచ్చి వెళ్లిన విషయం ఎవరు గమనించలేదు.

Leopard Attack: చిరుత దాడిలో నాలుగేళ్ళ చిన్నారి మృతి చెందిన ఘటన జమ్మూకాశ్మీర్ లో చోటుచేసుకుంది. బుద్గామ్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి చొరబడిన చిరుత నాలుగేళ్ళ చిన్నారి ఆదా షకీల్ ని లాక్కెళ్ళింది. ఇంట్లోకి చిరుత వచ్చి వెళ్లిన విషయం ఎవరు గమనించలేదు. గురువారం రాత్రి ఆదా షకీల్ కనిపించకపోవడంతో ఆమెకోసం తల్లిదండ్రులు రాత్రి మొత్తం వెతికారు. శుక్రవారం ఉదయం ఇంటికి సమీపంలోని అటవీ ప్రాంతాల్లో బాలిక మృతదేహం కనిపించింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు అటవీ శాఖ సిబ్బందితో కలిసి ఘటన స్థలికి చేరుకొని ఆదా షకీల్ మృతదేహాన్ని పరిశీలించారు. శరీరంపై గాయాలు ఉండటంతో చిరుత దాడిలో మృతి చెందినట్లు నిర్దారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అటవీ సిబ్బంది చిరుత జాడకోసం గాలింపు చేపట్టారు. ఈ ప్రాంతంలో చిరుతల బెడద అధికంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా కొందరిపై చిరుత దాడి చేసినట్లు తెలుస్తుంది. చిరుత దాడితో స్థానికులు హడలిపోతున్నారు. చిరుత నుంచి తమను రక్షించాలని వేడుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు