చిరుత, ముళ్లపంది పోరు..గెలుపెవరిదో చూడండీ..

  • Publish Date - November 21, 2019 / 10:01 AM IST

అడవుల్లో ఉండే జంతువులు ఒకదానిపై ఒకటి పోరాడుతునే ఉంటాయి. ఆధిపత్యం కోసం కొన్ని పోరాటాలు జరిగితే…బ్రతకటం కోసం కొన్ని పోరాటాలు జరుగుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని భయంకరంగా ఉంటాయి. ఇటువంటివి కొన్ని వీడియోలు ఫారెస్ట్ అధికారులు తమ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తుంటారు. అటువంటిదే ఈ చిరుతపులి-ముళ్లపంది పోరు. 

చిరుత, ముళ్ల పంది మధ్య జరిగిన పోరాటం వీడియోను ఇండియన్‌ ఫారెస్టు అధికారి పర్విన్‌ కశ్వాన్‌ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఓ దారిలో రాత్రి సమయంలో చిరుత, ముళ్ల పంది ఎదురుపడ్డాయి. దీంతో ముళ్ల పందిని చంపి తినేందుకు చిరుత పులి యత్నించింది. కానీ ముళ్ల పంది పేరు చెబితే సింహమైన పలాయనం చిత్తగించాల్సిందే. కానీ జోరుమీదున్న చిరుత ముళ్లపందిని చంపి తినాలనుకుంది. కానీ ముళ్ల పందికి దాని ముళ్లే రక్షణ కదా. చిరుత ముళ్లపందిని పట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నించింది.

కానీ ముళ్ల పంది తన ముళ్లను పైకి లేపి చిరుతకు చుక్కలు చూపెట్టింది. వెనక్కి తిరిగి చిరుతపై ఎటాక్ చేసింది. దాంతో చిరుత నోరుకు పంది ముళ్లు గుచ్చుకున్నాయి. చిరుతకు చిరాకొచ్చింది. కానీ ఏం చేయలేని పరిస్థితి. ముళ్ల పందితో పెట్టుకుంటే తనకు మూడినట్లేనని తెలిసింది. వెంటనే చిరుత చేసేదేమీ లేకి పలాయనం చిత్తగించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

చిరుతను చూస్తే ఎంత పెద్ద జంతువైన భయపడాల్సిందే.. కానీ ముళ్ల పంది ముందు ఎంత పెద్ద జంతువు పప్పులు ఉడకవ్. ఈ విషయం పాపం చిరుతకు బాగా అర్థం అయ్యింది.