షాహీన్ బాగ్ ఆందోళనకారులతో మాట్లాడిన సుప్రీంకోర్టు మధ్యవర్తులు

పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా రెండు నెలలకుపైగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏరియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో మహిళలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కేంద్రం సీఏఏను ఉపసంహరించుకోవాలని వీరు  ఆందోళన చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారింది.

అయితే షాహీన్ బాగ్ లో వారి ఆందోళనల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. దీంతో రోడ్డు డైవర్షన్స్,రోడ్డ దిగ్భంధం నుంచి వాహనదారులకు ఇబ్బంది కలుగకుండా షాహీన్ బాగ్ నుంచి ఆందోళనకారులు తమ నిరసనను వేరే ప్రాంతంలో కొనసాగించాలని,ఈ మేరకు ఆందోళనకారులతో మాట్లాడేందకు మధ్యవర్తులుగా ఇద్దరు సీనియర్ అడ్వకేట్లు సంజయ్ హెగ్డే,సదన రామచంద్రన్ లను సోమవారం(ఫిబ్రవరి-17,2020)  సుప్రీంకోర్టు ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

ఇవాళ(ఫిబ్రవరి-19,2020)సుప్రీంకోర్టు తరపున మధ్యవర్తులుగా ఎంపిక అయిన సీనియర్ అడ్వకేట్లు సంజయ్ హెగ్డే,సదన రామచంద్రన్ లు షాహీన్ బాగ్ లోని ఆందోళనకారులను కలిశారు. వారితో మాట్లాడారు. ఆందోళనకారులనుద్దేశించి సదన రామచంద్ర మాట్లాడుతూ…ఆందోళన చేసే హక్కు మీకు ఉంది. సీఏఏ సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేయబడింది. ప్రతిఒక్క వాయిస్ మేం వింటాం. ఈ సమస్యకు  ప్రపంచానికి కూడా ఒక ఉదాహరణగా నిలిచేటువంటి పరిష్కారం గుర్తిద్దాం. మనం ఒకరికొరం మాట్లాడుకుని ఓ పరిష్కారానికి వద్దాం. అయితే ప్రారంభ చర్చలు మీడియా ముందు వద్దు. రోడ్లను ఉఏపయోగించుకునేందుకు,తమ షాపులు ఓపెన్ చేసుకునేందుకు మనలాగే ఇతరులకు కూడా వాళ్ల హక్కులు కలిగి ఉన్నారని,ఆందోళన ప్లేస్ ను షాహీన్ బాగ్ నుంచి వేరొక చోటుకు మార్చుకోవాలని ఆందోళనకారులను రామచంద్ర కోరారు.

సుప్రీంకోర్టు పంపిన మధ్యవర్తులు ఇద్దరూ…. ఆందోళనలో పాల్గొన్న ఓ మహిళను మీడియా ముందు కాకుండా పక్కకు వచ్చి తమతో మాట్లాడాలని కోరారు. అయితే అందుకు ఆ మహిళ నిరాకరించింది. రిపోర్టర్ల మధ్యలోనే మాట్లాడాలని ఆ మహిళ తేల్చి చెప్పింది. మీడియా ముందు ఆందోళనాకారులతో ఫ్రీగా మాట్లాడటం సాధ్యం కాదని,తమ మధ్య సంబాషణ ముగిసిన తర్వాత మీడియా ఆ సంబాషణను ప్రసారం చేస్తుందని ఇద్దరు మధ్యవర్తులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు