Lightning Kills Elephants : తీవ్ర విషాదం, పిడుగుపాటుకు 18 ఏనుగులు మృతి

అసోంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు 18 ఏనుగులు బలయ్యాయి. అసోం నాగోన్‌ జిల్లా అటవీ ప్రాంతంలో బుధవారం(మే 12,2021) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని అటవీ శాఖ ఉన్నతాధికారి అమిత్‌ సహాయ్‌ వెల్లడించారు. ఓ పర్వతంపై 14 ఏనుగులు, ఆ కొండకు దిగువభాగంలో మరో నాలుగు ఏనుగుల కళేబరాలను తమ సిబ్బంది గుర్తించారని ఆయన చెప్పారు. పిడుగు పడటం వల్ల అవి చనిపోయినట్టు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు.

Lightning Kills Elephants : అసోంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు 18 ఏనుగులు బలయ్యాయి. అసోం నాగోన్‌ జిల్లా అటవీ ప్రాంతంలో బుధవారం(మే 12,2021) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని అటవీ శాఖ ఉన్నతాధికారి అమిత్‌ సహాయ్‌ వెల్లడించారు. ఓ పర్వతంపై 14 ఏనుగులు, ఆ కొండకు దిగువభాగంలో మరో నాలుగు ఏనుగుల కళేబరాలను తమ సిబ్బంది గుర్తించారని ఆయన చెప్పారు. పిడుగు పడటం వల్ల అవి చనిపోయినట్టు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు.

అసోంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ పిడుగులు పడుతున్నాయి. వాటి వల్ల మూగజీవాలు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఒకేసారి 18 ఏనుగులు మృతి చెందడం విషాదం నింపింది. పిడుగుపాటుకు జంతువులు చనిపోతున్నాయని, వెస్ట్ బెంగాల్ లో పిడుగు పడి 5 ఏనుగులు చనిపోయాయని అటవీశాఖ అధికారులు గుర్తు చేశారు.

కాగా, ఏనుగుల మరణాలపై ఉన్నతాధికారులు దర్యాఫ్తునకు ఆదేశించారు. ఏనుగుల మృతికి కారణం తెలుసుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం వెటర్నరీ డాక్టర్లు, అటవీ నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకుంటుందని, చనిపోయిన ఏనుగుల కళేబరాలను పరీక్షిస్తుందని, వాటి మృతికి పిడుగుపాటే కారణమా లేక మరో కారణం ఏదైనా ఉందా అనేది తేలుస్తుందని అధికారులు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు