ప్రతీకారం తీర్చుకున్న లైన్ మెన్..పోలీస్ స్టేషన్ కు రూ. 3 లక్షల ఫైన్ వేశాడు, ఎందుకో తెలుసా ?

  • Publish Date - July 22, 2020 / 10:15 AM IST

మాస్క్ పెట్టుకోనందుకు రూ. 500 జరిమాన వేయడంతో కరెంటు బిల్లులు కట్టలేదని ఓ లైన్ మెన్ పీఎస్ కు కరెంటు కట్ చేసిన ఘటన గుర్తుండే ఉంటుంది కదా…సేమ్ ఇలాగే చేశాడు మరో లైన్ మెన్. ఎలాగైనా ప్రతికారం తీర్చుకోవాలని అనుకున్నాడు.

అనుకున్న టైం వచ్చేసింది. కరెంటు దొంగిలిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ కు రూ. 3 లక్షల ఫైన్ వేశాడు ఆ లైన్ మెన్. దీనికి సంబంధించిన….వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే…

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఎలక్ట్రిక్ లైన్ మెన్ వాహనంపై వెళుతుండగా..ట్రాఫిక్ పోలీసులు ఆపారు. హెల్మెట్ ధరించలేదని రూ. 500 ఫైన్ వేశారు. ఇదంతా గత సంవత్సరంలో చోటు చేసుకుంది. ఇది మనస్సులో పెట్టుకున్నాడు. పోలీస్ స్టేషన్ వివరాలు తెలుసుకొనే పనిలో పడి..కరెంటు బకాయిలున్నట్లు గుర్తించి పీఎస్ కు పవర్ కట్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా..పంజాబ్ రాష్ట్రంలో…మాస్క్ ధరించకుండా వెళుతున్నాడంటూ మరో లైన్ మెన్ కు రూ. 500 ఫైన్ వేశారు. సేమ్ గతంలో లైన్ మెన్ ఏ విధంగా చేశాడో..ఇతను కూడా అదే విధంగా చేశాడు. పీఎస్ వాళ్లు…కరెంటును దొంగతనం చేస్తున్నారంటూ.. ఆ లైన్ మెన్ తన సిబ్బందితో వచ్చి…రూ. 3 లక్షలు కట్టాలని నోటీసులు ఇచ్చాడు.