Delhi : వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రోజున మద్యం షాపులు బంద్..ఎక్కడంటే?

ఈ మేరకు కమిషనర్ కృష్ణ ఉప్పు అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఛాత్ పూజ పండగ సందర్భంగా ఆదివారం ఢిల్లీలో మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.

Liquor shops closed

Delhi Liquor Shops Closed : ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం అహ్మదాబాద్ లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. వరల్డ్ కప్ జరిగే రోజు ఢిల్లీలో మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. దీంతో దేశ రాజధానిలో ఆదివారం ఎలాంటి మద్యం అమ్మకాలు ఉండవు. మద్యం అమ్మకాలకు క్రికెట్ కు ఎటువంటి సంబంధం లేదు. కానీ, ఛాల్ పూజ వల్ల ఢిల్లీలో మద్యం అమ్మకాలు ఉండబోవని ఎక్సైజ్ కమిషనర్ కృష్ణ ఉప్పు వెల్లడించారు.

ఈ మేరకు కమిషనర్ కృష్ణ ఉప్పు అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఛాత్ పూజ పండగ సందర్భంగా ఆదివారం ఢిల్లీలో మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ లలో ఛాత్ పూజను ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడక నాలుగు రోజులపాటు కొనసాగనుంది.

Rahul Dravid : 2007 నాటి ప్రపంచ కప్ చేదు జ్ఞాపకాలు.. ఈ వరల్డ్ కప్‌ విజయంపైనే ఆశలు.. ద్రవిడ్ కోచ్‌గా కొనసాగుతాడా లేదా?

మార్చి 8హోలీ, అక్టోబర్ 2 గాంధీ జయంతి, అక్టోబర్ 24 దసరా, నవంబర్ 12 దివాళీ పండుగల వేళ కూడా ఢిల్లీలోని 637 మద్యం దుకాణాలు మూసివేశారు. మళ్లీ డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా మద్యం దుకాణాలను బంద్ చేస్తారు.