Petrol : ఆ పెట్రోల్ బంక్ లో.. లీటర్ పెట్రోల్ ఉచితం
తమిళనాడులోని ఓ పెట్రోల్ బంక్ లో లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తున్నారు. అయితే దీనికో షరతు పెట్టారు. మీ ఆధార్, పాన్ కార్డు జీరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
- kunduru Vinod
- Updated on- September 11, 2021 / 09:41 PM IST
Petrol (2)
Petrol : పెట్రోల్ రేట్లు భగ్గుమంటున్నాయి. మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100కు పైనే ఉంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని ఓ పెట్రోల్ బంక్ లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తోంది. అయితే దీనికి ఓ షరతు పెటింది. పెట్రోల్ కావాలి అనుకునేవారు వారి ఆధార్, పాన్ కార్డు వివరాలు చెప్పాలి. తమిళనాడులోని ఉతిరమోరూర్ గ్రామంలోని బంక్ నిర్వాహకులు ఉచితంగా లీటర్ పెట్రోల్ ఇస్తుండటంతో స్థానికులు పాన్, ఆధార్ జీరాక్స్ లు తీసుకోని బారులు తీరారు.
Read More : Tejashwi Yadav : ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కిన ఆర్జేడీ యువనేత.. వైరల్ వీడియో
కాగా, స్థానిక శ్రీరామ్ కమర్షియల్ వెహికల్ ఫైనాన్స్ సంస్థ ఈ ఉచిత లీటర్ పెట్రోల్ ప్రచారాన్ని చేపట్టినట్లు తెలుస్తున్నది. తమ వ్యాపారం కోసం సంస్థ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోమని చెప్పడంతోపాటు ఆధార్, పాన్ కార్డుల వివరాలను సేకరిస్తున్నది. వాటిని ఇచ్చిన వారికి ఒక లీటర్ పెట్రోల్‌ను ఉచితంగా అక్కడి బంక్ ద్వారా అందిస్తున్నది.
Read More : Ram Charan : మెగా పవర్‌స్టార్.. వెయ్యి కోట్ల హీరో..
