Tejashwi Yadav : ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కిన ఆర్జేడీ యువనేత.. వైరల్ వీడియో

బీహార్ లో త్వరలో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నేతలు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. ఈ సమయంలోనే ఆర్జేడీ నేత తేజస్వి ఓటర్లకు డబ్బు పంచుతూ కెమెరాకు చిక్కారు

Tejashwi Yadav : ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కిన ఆర్జేడీ యువనేత.. వైరల్ వీడియో

Tejashwi Yadav

Tejashwi Yadav : బీహార్ లో త్వరలో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యనేతలు గ్రామాల్లో తిష్టవేశారు. అధికార ప్రతిపక్ష పార్టీలు సభలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ఓ గ్రామంలో పర్యటిచారు. అక్కడ కొందరు మహిళలకు ఆయన డబ్బు పంచారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Read More : 4th BJP CM Vijay Rupani : 6 నెలల్లోనే నలుగురు సీఎంలు రాజీనామా.. బీజేపీ వ్యూహం ఇదేనా?

ఈ వీడియోను జేడీయూ ఎమ్మెల్సీ నీరజ్‌కుమార్‌ శుక్రవారం ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ఆ వీడియోలో రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) యువ నాయకుడు, మాజీ సీఎం లాలూప్రసాద్‌ యాదవ్‌ తనయుడు తేజస్వీ యాదవ్‌ ఓ గ్రామంలో మహిళలకు డబ్బులు పంచుతూ కనిపించారు. తన కాన్వాయ్‌లో కూర్చుని అక్కడకు వచ్చిన మహిళలకు బహిరంగంగా రూ.500 నోట్లు ఇస్తున్నాడు. ‘డబ్బులు పంచుతున్న ఈ యువరాజు ఎవరు? లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వి యాదవ్‌’ అని పేర్కొంటూ ఆ వీడియోను పంచుకున్నారు.

Read More :  Allu Arjun : కాకినాడలో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్..

ఈ వ్యవహారం అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికల సమయంలో డబ్బులు పంచి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. తేజస్వి యాదవ్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ డబ్బు పంపిణీ అధికార పార్టీ, ఆర్జేడీ మధ్య వాగ్వాదం మొదలైంది. విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు.