Livestock Inspector: అధికారులు ఆశ్చర్యపోయేలా కళ్లు చెదిరే ఆస్తులు కూడబెట్టిన పశుసంవర్ధకశాఖ ఉద్యోగి

పశుసంవర్ధకశాఖలో పనిచేసే పశువుల ఇన్స్పెక్టర్..తన ఆదాయానికి మించి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టడంపై అవినీతి నిరోధకశాఖ అధికారులే విస్మయం వ్యక్తం చేశారు.

Livestock Inspector: ప్రభుత్వ సంస్థలో పనిచేసే చిరు ఉద్యోగి సైతం ఎంతటి అవినీతికి పాల్పడుతున్నది తెలిపే ఘటన ఇది. పశుసంవర్ధకశాఖలో పనిచేసే పశువుల ఇన్స్పెక్టర్..తన ఆదాయానికి మించి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టడంపై అవినీతి నిరోధకశాఖ అధికారులే విస్మయం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..ఒడిశా రాష్ట్రం భుబనేశ్వర్ నగరానికి చెందిన జగన్నాథ్ రౌత్ అనే వ్యక్తి గత 20 ఏళ్లుగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్ధకశాఖలో పశువుల ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. గత 20 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా జగన్నాథ్ ప్రస్తుత జీతం రూ.50 వేలు. అయితే తన 20 ఏళ్ల ఉద్యోగ జీవితంలో జగన్నాథ్ ఎంతో అవినీతికి పాల్పడ్డాడని..ఇప్పటి వరకు మొత్తం రూ.7.21 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు అవినీతి నిరోధకశాఖ అధికారులు వెల్లడించారు. జగన్నాథ్ రౌత్ అవినీతి పై గతంలోనూ పలుమార్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో గురువారం ఓడిశాలోని అతని నివాసాలపై అవినీతి నిరోధకశాఖ అధికారులు దాడులు చేశారు.

Also Read:ISRO Shukrayaan-I : వీనస్ గ్రహంపై ఫోకస్ పెట్టిన ఇస్రో..రహస్యాల గుట్టు విప్పుతామంటున్న శాస్త్రవేత్తలు

ఈదాడుల్లో బయటపడిన ఆస్తులు చూసి అధికారులకే దిమ్మ తిరిగింది. ఒడిశాలో ప్రధాన నగరాలైన భుబనేశ్వర్, కట్టక్ నగరాల్లో జగన్నాథ్ పేరు మీద 91 ప్లాట్లు(ఇళ్ల స్థలాలు) ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారమే లెక్కించినా కోట్లలో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. 5 పెద్ద భవనాలు, 2 ఫ్లాట్లు, 1 గెస్ట్ హౌస్ కూడా జగన్నాథ్ పేరుపైన గుర్తించారు అధికారులు. వీటితో పాటు అర కిలో బంగారం, 10 గ్రాముల వజ్రాలు, సుమారు రూ.40 లక్షల బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు విజిలెన్సు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే మూడో తరగతి స్థాయి ఉద్యోగి ఇన్ని కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించడం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొన్నారు.

Also read:Priyanka Mohite: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ

ట్రెండింగ్ వార్తలు