×
Ad

LK Advani : రామమందిర ప్రారంభోత్సవానికి ఎల్ కె అద్వానీ…వీహెచ్‌పీ నేత వెల్లడి

అయోధ్యలో జనవరి 22వతేదీన జరగనున్న రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సీనియర్‌ బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ హాజరు కానున్నారా ? అంటే అవునంటున్నారు విశ్వహిందూ పరిషత్ నాయకులు....

  • Published On : January 11, 2024 / 12:24 PM IST

LK Advani

LK Advani : అయోధ్యలో జనవరి 22వతేదీన జరగనున్న రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సీనియర్‌ బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ హాజరు కానున్నారా ? అంటే అవునంటున్నారు విశ్వహిందూ పరిషత్ నాయకులు. అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సీనియర్‌ బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ హాజరు కానున్నారని విశ్వహిందూ పరిషత్‌ నేత ఒకరు చెప్పారు. ఎల్‌కే అద్వానీ ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా ఈ కార్యక్రమానికి రావద్దని కోరినట్లు రామ్ మందిర్ ట్రస్ట్ గతంలో తెలిపింది.

ALSO READ : Covid-19 : కొవిడ్ వైరస్‌తో డిసెంబరులో 10వేలమంది మృతి…ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

రామజన్మభూమి ఉద్యమానికి నాయకత్వం వహించిన బీజేపీ నాయకులలో 96 ఏళ్ల ఎల్‌కె అద్వానీ ఒకరు. దీంతో రామమంది ప్రాణ్ ప్రతిష్ఠ వేడుకకు హాజరు కావాలని అద్వానీ నిర్ణయించుకోవడం గమనార్హం. డిసెంబరులో అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా బీజేపీ కురువృద్ధులు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను వీహెచ్‌పీ ఆహ్వానించింది. అయితే ఎల్‌కే అద్వానీ, 89 ఏళ్ల మురళీ మనోహర్ జోషి ఆరోగ్యం దృష్ట్యా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం లేదని ఆలయ ట్రస్ట్ తెలిపింది.

ALSO READ : MP Bandi Sanjay : అయోధ్య రామయ్య అందరికీ దేవుడు.. కాంగ్రెస్ రాజకీయం చేయడం తగదన్న బండి సంజయ్

ఎల్‌కె అద్వానీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు కల్పిస్తామని వీహెచ్‌పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ చెప్పారు. పరిమిత ఆహ్వానితులతో రామమందిరాన్ని జనవరి 22వతేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా వేలాది మంది వీక్షకులను ఆహ్వానించారు.

ALSO READ : YouTube : తల్లీ,కొడుకులపై అసభ్యకర వీడియోలు…యూట్యూబ్ ఇండియాకు బాలల హక్కుల కమిషన్ నోటీసులు

ఆహ్వానితులలో అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించిన కార్మికుల కుటుంబాలు కూడా పాల్గొననున్నాయి. జనవరి 16వతేదీ నుంచి ప్రారంభమయ్యే ఏడు రోజుల పాటు ఉత్సవాలతో అయోధ్య పట్టణం సిద్ధమవుతోంది. జనవరి 15 నాటికి సంప్రోక్షణ వేడుకకు సన్నాహాలు పూర్తవుతాయి.